Search
Friday 20 April 2018
  • :
  • :

ప్రాణం తీసిన చెంపదెబ్బల ఆట

Student Dies During Slap Fight Game in Pakistan

 

ఇస్లామాబాద్: చెంపదెబ్బల ఆట ప్రాణం తీసిన ఘటన పాకిస్థాన్ దేశం పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్ ఛన్ను పాఠశాలలో జరిగింది. ఆటల పిరియడ్‌లో ఇద్దరు విద్యార్థులు చెంపల దెబ్బ ఆటలో పాల్గొన్నారు. బిలాల్, అమీర్ అనే విదార్థులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురుపించుకున్నారు. అమీర్ కొట్టిన దెబ్బలు తాళలేక బిలాల్ అనే విద్యార్థి  ఘటనా స్థలంలోనే పడిపోయాడు. ఎవరు సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో పోలీసులు ఆలస్యంగా వచ్చి బిలాల్‌ను వైద్యశాలకు తరలించారు. బిలాల్ మెడపైనా బలమైన దెబ్బలు తాకడంతో నరాలు చిట్లిపోయి మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. కేసు నమోదు చేయవద్దని బిలాల్ తల్లిదండ్రులకు పోలీసులు సూచించారు. తమ కుమారుడు చావు దైవాజ్ఞ అని  తల్లిదండ్రులు చెప్పారు. ఈ వీడియో కొన్ని రోజులుగా యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది.

Comments

comments