Search
Friday 20 April 2018
  • :
  • :

సుప్రీంకోర్టు న్యాయవాదుల నిరసన ప్రదర్శన

LAWYERS

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై దుండగులు అత్యాచారం చేసి, ఆపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈఘటనను నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదులు ఈ ఘటనను నిరసిస్తూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కథువా ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఈ కథువా ఘటనతో తమకు సంబంధం లేదని నిందితులు కోర్టుకు తెలిపారు. తమకు నార్కో పరీక్షలు నిర్వహించాలని వారు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Supreme Court Advocates Protest in Delhi

Comments

comments