Search
Friday 20 April 2018
  • :
  • :

బ్యాంకింగ్ వ్యవస్థను సర్వ నాశనం చేశారు : రాహుల్

RAHUL

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను సర్వ నాశనం చేశారని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. మోడీ తీరు వల్లనే ప్రముఖ వజ్రాల వ్యాపారవేత్త నీరవ్ మోడీ బ్యాంకులకు 30 వేల కోట్ల మేర ఎగ్గొటి విదేశాలకు పారిపోయారని ఆయన విమర్శించారు. ప్రధాని మోడీ నీరవ్ విషయం, రాఫెల్ కుంభకోణంపై మాట్లాడేందుకు జంకుతున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దు ఓ చారిత్రాత్మక తప్పిదమని, నోట్ల రద్దు వల్ల ప్రజలు నగదు కొరతతో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

The Banking System is Totally Destroyed : Rahul

Comments

comments