Search
Friday 20 April 2018
  • :
  • :

భూసేకరణను పూర్తి చేయాలి

SK_Joshi

హైదరాబాద్ : జాతీయ రహదారుల నిర్మాణం కోసం భూసేకరణను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వ సిఎస్ ఎస్‌కె జోషి అధికారులను ఆదేశించారు. మంగళవారం సిఎస్ జోషి వివిధ శాఖల అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ధరణి వెబ్‌సైట్, భూరికార్డుల ఆధునీకరణ అంశాలపై సిఎం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు ముద్రించిన 20లక్షల పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలకు పంపించామని ఆయన చెప్పారు. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలకు అవసరమైన భూమి కోసం వక్ఫ్ భూములను గుర్తించాలని ఆయన అధికారులకు సూచించారు. మైనార్టీ శాఖకు బడ్జెట్‌లో రూ.2వేల కోట్లు కేటాయించామన్నారు. 319 మైనార్టీ సంస్థలకు సంబంధించి రూ.35 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఎస్‌సి రెసిడెన్షియల్ పాఠశాలల కోసం 72 చోట్ల భూములను గుర్తించాల్సి ఉందని జోషి తెలిపారు.

The Land Acquisition Should be Completed : CS

Comments

comments