Search
Friday 20 April 2018
  • :
  • :

తోబుట్టువు కాదు తోడేలు..! (వీడియో)

The Old Lady Brutally Beaten By Relatives In Rajahmundry

అమరావతి: మావత్వం మరిచిపోయి తోబుట్టువు అనే కనికరం కూడా చూపకుండా అమానుషంగా ప్రవర్తించిందో మహిళ. పక్షవాతం వచ్చిన ఓ వృద్ధరాలిని ఆస్తి విషయమై చెల్లెలే చిత్రహింసలకు గురిచేసింది. ఈ ఘనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… ఎపిలోని తూర్పు గోదావరి జిల్లా పెనికేరుకు చెందిన పుష్పవతి భర్త మరణించడంతో నరేంద్రపురంలోని వరసకు చెల్లెలైన మంగాదేవి ఇంట్లో ఉంటోంది. అయితే పుష్పవతి పేరున పెనికేరులో కొంత స్థలం ఉంది. అది తన పేరున రాస్తుందన్న ఆశతో పుష్పవతికి సేవలు చేస్తోంది. ఈ క్రమంలో ఏడాది క్రితం పుష్పవతికి కాళ్లు చేతులు పడిపోయి మంచానికే పరిమితమైంది.

అప్పటి నుంచి పుష్పవతి పేరున ఉన్న స్థలాన్ని తన పేరిట రాయాలంటూ మంగాదేవి ఆమెను హింసించడం ప్రారంభించింది. వెంటనే తన పేరుపై రాయాలంటూ గత కొన్ని రోజులుగా పుష్పవతిపై దాష్టీకంగా ప్రవర్తిస్తుంది. దీనికి పుష్పవతి నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మంచంపై లేవలేని స్థితిలో ఉన్న ఆమెపై మంగాదేవి పైశాచికంగా ప్రవర్తిస్తూ వస్తోంది. స్థానికులు ప్రశ్నించడంతో మంగాదేవి ఇళ్లు ఖాలీ చేసి లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి షిఫ్ట్ అయింది. ఇక్కడ కూడా తన దాష్టీకాన్ని ఆపలేదు మంగాదేవి. ఒకరోజు పుష్పవతిని హింసిస్తున్న సమయంలో ఓ యువకుడు ఆ దృశ్యాలను రికార్డు చేసి అంతర్జాలంలో పెట్టాడు. అది కాస్తా వైరల్ కావడం, పోలీసుల కంటపడటంతో పోలీసులు బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించారు. అనంతరం అమానుషంగా ప్రవర్తించిన మంగాదేవిని అదుపులోకి తీసుకున్నారు.

(Courtesy By: TV5)

Comments

comments