Search
Friday 20 April 2018
  • :
  • :

సింహాలు చీల్చుకుతింటున్న సిరియా

int

అమెరికా సంకీర్ణ దళాల మెరుపుదాడులు

పలు ప్రాంతాల్లో భీకర పేలుళ్లు

డమాస్కస్/ వాషింగ్టన్ : సిరియాపై అమెరికా శనివారం భీకర స్థాయిలో మెరుపుదాడులకు దిగింది. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఈ దాడులు చేపట్టారు. చాలాకాలంగా అంతర్యుద్ధంతో రగిలిపోతున్న సిరియాలో అమెరికా నేతృత్వపు సం కీర్ణ దళాలు సాగించిన దాడులతో ప్రత్యక్ష యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ బలగాలు శుక్రవారం రాత్రి ఆరంభించిన నిర్దిష్ట సైనిక చర్య శనివారం నాటికి ఉధృతమైంది. రష్యా సహకారంతో సిరియాలోని బషర్ అల్ అసద్ ప్రభుత్వం తిరుగుబాటుదార్ల ఏరివేత పేరిట అరాచాకాలకు దిగుతోందని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో సిరియా బలగాలు రసాయనిక ఆయుధాలను ప్రయోగించడం చివరికి ఆ దేశ సామాన్య పౌరుల బలికి దారితీస్తోందని, రష్యా క్షిపణుల అండ చూసుకుని బషర్ చెలరేగిపోతున్నాడని ట్రంప్‌మండిపడ్డారు. అమెరికా ఇక రష్యా మిస్సైల్స్‌కు చెక్‌పెడుతుందని, తమ బలం ఏ పాటిదో తెలియచేస్తామని ట్రంప్ హెచ్చరించిన కొద్ది రోజులకే సిరియాలో పలు చోట్ల దాడులు జరిగాయి.అమెరికా,బ్రిటన్, ఫ్రాన్స్ లు సంయుక్తంగా ఈ దాడులను చేపట్టాయి. రసాయనిక ఆయుధాల ఉత్పత్తి, వ్యాప్తి, వాడకాన్ని అరికట్టేందుకు ఈ దిశలోగట్టి హెచ్చరికలు వెలువరించేందుకు ఈ సంయుక్త చర్యను చేపట్టినట్లు ట్రంప్ శనివారం తెలిపారు.
తూర్పు డమాస్కస్‌లో భారీ స్థాయి దాడులు
శుక్రవారం రాత్రి నుంచే డమాస్కస్ ఇతర చోట్ల సంకీర్ణ బలగాల దాడులతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాలలో భీకర పేలుళ్ల శబ్దాలు విన్పించాయి. సంకీర్ణ బలగాల వైమానిక దళాలు భారీ స్థాయిలో సిరి యా సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. అయితే ఈ దాడులలో మృతుల సంఖ్యపై వివరాలు వెల్ల డి కాలేదు. ఈ ప్రాంతం అంతా దట్టమైన నారింజ రంగు పొగలతో కన్పిస్తోందని వార్తా సంస్థలు తెలిపాయి. పలు చోట్ల పెద్ద ఎత్తున మంటలు వెలువడ్డాయి.సిరియన్ ఎయిర్ డిఫెన్స్, సైంటిఫిక్ రిసెర్చ్ సెంటర్‌లపై రాకెట్లు ప్రయోగించారు. సిరియా ఆయువుపట్టు సైనిక కేంద్రాలను లక్షంగా చేసుకునిదాడులకు దిగినట్లు ఈ క్రమం తో వెల్లడైంది. తమ దాడుల క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో నూ సామాన్య పౌరులకు నష్టం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు బ్రిటన్ ప్రధాని థెరిసా తెలిపారు సిరి యాఅధినేత ఆగడాలకు కళ్లెం వేసేందుకుయత్నించామ నిఅయితే ఇవి సాధ్యం కాకపోవడంతో ప్రస్తుతం ఈ దా డులు చేయక తప్పడం లేదని బ్రిటన్ ప్రధాని తెలిపారు.
ట్రంప్ జాతీయ ప్రసంగం : సిరియాపై దాడుల నిర్ణయాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ టీవీ ద్వారా జాతిని ఉద్ధేశించి చేసిన ప్రసంగంలో తెలిపారు. దౌమాలో రసాయనిక దాడులు జరిగి వేలాది మంది పౌరులు బాధితులు కావడాన్ని ఆయన ప్రస్తావించారు. రసాయనిక దాడులు వ్యక్తులు చేసినవి కావని, రాక్షాసకాండ అని మండిపడ్డారు. సిరియాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు అమెరికా మిత్రదేశాలతో కలిసి దాడులకు దిగుతోందని, ఇవి తిరుగులేని విధంగా ఉంటాయని ట్రంప్ చెప్పారు. అసద్ ఆధిపత్యం ఇకనైనా రసాయనిక దాడుల జోలికి పోకుండా అమెరికా అన్ని విధాలుగా ఒత్తిడి తీసుకువస్తుందని ట్రంప్ తెలిపారు. సిరియాలోని రసాయనిక ఆయుధాల స్థావరాలు, సంబంధిత కేంద్రాలను లక్షంగా చేసుకుని మిత్రదేశాల బలగాలతో కలిసి అమెరికా వైమానిక బలగాలు దాడులను కొద్ది సేపటి క్రితం ప్రారంభించినట్లు వెల్లడించారు. అమాయక పౌరుల ఊచకోతకు అసద్ ప్రభుత్వం రసాయనిక దాడులను వాడుకోవడం ఉన్మాద చర్యగా అన్నిస్తోందని విమర్శించారు. ఎందరో పిల్లలు తల్లులు తండ్రులు అనాధలు రసాయనిక దాడులతో తల్లడిల్లారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో సరైన ప్రాణవాయువు అందక వేలాది మంది పౌరులు జీవన్మరణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ అమానుషానికి తగు జవాబుగానే ఇప్పుడు ఈ దాడికి సంకల్పించినట్లు తాను ఈ సందర్భంగా అమెరికన్లందరికీ తెలియచేసుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్ , రష్యాలు ఎవరివైపో ఎంచుకోవాలి
మానవాళికి చేదు గాయాలను మిగులుస్తున్న రసాయనిక దాడుల నేపథ్యంలో రష్యా, ఇరాన్‌లు తమ వైఖరి ఏమి టీ? వారు ఎవరిపక్షం ? అనేది తేల్చుకోవాలని ట్రంప్ హెచ్చరించారు. అమాయక పౌరులను క్రూరంగా బాధిస్తున్న వారికి కొమ్ముకాయాలని ఎలాంటి దేశాలు అనుకుంటాయి? దేశాలకు ఉండే మిత్రులను బట్టే ప్రపంచంలో ఆయా దేశాల వైఖరి వెల్లడి అవుతుందని, ఏ దేశం మంచిది ఏది కాదనేది వారి మిత్రపక్షంతోనే స్పష్టం అవుతుందని ట్రంప్ ఈ సందర్భంగా రష్యాకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలి దాడులతో సిరియా రసాయనిక దాడులను అరికడుతామనే రష్యా వాగ్ధానభంగానికి పాల్పడిందని ట్రంప్ చెప్పారు. రష్యా ఇప్పటికైనా ఒక నిర్ణయానికి రావాలని, వారు చీకటి మార్గంలో వెళ్లుతారా? పౌర సమాజంతో వెలుగులోకి కలిసి వస్తారా? తేల్చుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దెబ్బకు దెబ్బ : రష్యా హెచ్చరిక
అమెరికా దాడులపై రష్యా తీవ్రంగా స్పం దించింది. తమ అధినేత వ్లాదిమిర్ పుతిన్‌ను అవమానించే విధంగా మాట్లాడుతూ ట్రంప్‌ఆకస్మిక దాడులకు దిగడాన్ని సహించేది లేదని రష్యా అధికారిక ప్రకటన వెలువరించింది. అమెరికా మిత్రపక్షాల చర్యను తాము ఉపేక్షించేది లేదని రష్యా విదేశాంగ ప్రతినిధి హెచ్చరించారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందని, అమెరికా తీవ్ర పరిణామాలను ఎదుర్కొవల్సి వస్తుందని రష్యా పేర్కొం ది. తమ వైమానిక స్థావరాలపై, నౌకా కేంద్రంపై అమెరికా దాడుల ప్రభా వం ఏదీ లేదని రష్యా తెలిపింది. తమ స్థావరాలపై కానీ, సమీప ప్రాంతాలలో కానీ అమెరికా తాజా మెరుపుదాడులు జరగలేదని, ఈ ప్రాంతంలోకి అమెరికా క్రూయిజ్ మిస్సైల్స్ ప్రవేశించలేదని తెలిపారు, టర్టస్, మియిమియ్‌ల్లోని రక్షణ స్థావరాలను అమెరికా టార్గెట్ చేసుకోలేదని నిర్థారణ అయినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Comments

comments