Search
Friday 20 April 2018
  • :
  • :

ఆటోను ఢీకొన్న లారీ : ముగ్గురు మృతి

LORRY

కర్నూలు : బనగానపల్లె సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఆటో డ్రైవర్ రామచంద్రుడు సహా ఇద్దరు తొమ్మిదో తరగతి విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఆటో బనగానపల్లె నుంచి ఇల్లూరు కొత్తపేటకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతి చెందిన విద్యార్థులను రామకృష్ణాపురం గ్రామానికి చెందిన వెంకటశివ, బనగానపల్లెకు చెందిన చెన్నకేశవగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని వారు వెల్లడించారు.

Three died in Road Accident at Kurnool

Comments

comments