Search
Friday 20 April 2018
  • :
  • :

కతువా ఘటనపై జమ్మూ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

supreme-court

న్యూఢిల్లీ: జమ్మూలోని కతువా జిల్లాలో ఏనిమిదేళ్ల బాలికపై కొందరు మృగాలు అత్యంత పాశవికంగా 8 రోజులపాటు అత్యాచారం చేసి, చంపేసిన ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ అత్యాచార ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు ఆసిఫా తండ్రి వేసిన పిటిషన్‌ను సుప్రీం పరిశీలించింది. అనంతరం జమ్మూకాశ్మీర్ ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఆసిఫా కుటుంబానికి రక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే ఈ కేసు వాదిస్తున్న లాయర్‌కు కూడా రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Comments

comments