Search
Friday 20 April 2018
  • :
  • :

ప్లీనరీ పనులు చకచక

trs

ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించిన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ తదితర టిఆర్‌ఎస్ నాయకులు
ట్రాఫిక్ సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలకు ప్రాధాన్యం

మన తెలంగాణ/ హైదరాబాద్: టిఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లపై నేతలు దృష్టి కేంద్రీకరించారు. హైదరాబాద్ శివారు ప్రాంతమైన కొంపల్లిలోని జిబిఆర్ గార్డెన్‌లో అన్ని హంగులతో టి ఆర్‌ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్లీనరీ కమిటీలు తమ కు అప్పగించిన బాధ్యతలను నిర్వహించడంలో నిమగ్నం కాగా ఏర్పాట్ల పర్యవేక్షణ కమిటీతో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సీనియర్ నేతలు ప్రతీరోజు ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, ఖనిజాభివృద్ధి సంస్థ (టిఎస్‌ఎండిసి) చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, ఎంఎల్‌ఎ వివేకానంద తదితరు లు పర్యవేక్షించారు. ప్లీనరీ వేదిక, ప్రతినిధులు కూర్చునే ప్రాంతం, భోజనశాలతో పాటు మంచినీటి సౌకర్యం, మజ్జిగ తదితర వసతులకు సంబంధించిన ఏర్పాట్లపై
వారు ఆరాతీశారు. ప్లీనరీకి వచ్చే వాహన పార్కింగ్ సదుపాయాలు, ఆ చుట్టు పక్కల ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందుస్తుగానే తీసుకునే చర్యలపై దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే ప్లీనరీ తీర్మానాల కమిటీ వివిధ అంశాలపై చర్చించి ముసాయిదా తీర్మానాలను ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అప్పగించింది. ప్లీనరీకి హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు ఎలాంటి లోటుపాట్లు రాకుండా నిర్వాహకులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్లీనరీకి కావాల్సిన వసతులు, ఏర్పాట్లపై నేతలు దృష్టి పెట్టారు. ప్లీనరీ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు పార్టీ ముఖ్యులు పర్యవేక్షిస్తున్నారు.

Comments

comments