Search
Friday 20 April 2018
  • :
  • :

టిఆర్‌ఎస్‌వి విద్యార్థుల కాళేశ్వరం యాత్ర

HARISH-RAO

హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు టిఆర్‌ఎస్‌వి విద్యార్థులు బయల్దేరి వెళ్లారు. వీరి యాత్రను తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని ఆయన కొనియాడారు. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యార్థులు పాలు పంచుకోవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ఆయన తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

TRSV Leaders and Students to Visit Kaleshwaram Project

Comments

comments