Search
Friday 20 April 2018
  • :
  • :

కతువాలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదు: యుఎన్ఒ

UN chief Antonio Guterres says Kathua Rape Murder Case is Horrific

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని కతువా ప్రాంతంలో ఓ ఆలయంలో కొందరు మృగాళ్లు ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి, గొంతునులిమి చంపేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది. ఈ ఘటనను  యుఎన్ఒ భయానక ఘటనగా పేర్కొంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఈ దారుణ ఘటనపై మాట్లాడుతూ… ఆ చిన్నారిపై ఇటువంటి దారుణానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. మీడియాలో వచ్చిన కథనాలు తనను కదిలించాయని, ఓ పసి ప్రాణాన్ని అతి భయంకరంగా హింసించి, హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి వారిని క్షమించకూడదని వెంటనే ఉరి తీయాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకూడదని తాను కోరుకుంటున్నానని తెలిపారు.

Comments

comments