Search
Friday 20 April 2018
  • :
  • :

హైకోర్టు తీర్పు హర్షణీయం : ఉత్తమ్

Uttam Kumar reddy Speech on KCR Government

హైదరాబాద్ : తమ పార్టీ ఎంఎల్‌ఎలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల అసెంబ్లీ సభ్యత్వాల రద్దు కేసులో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు నిరంకుశ పాలన చేస్తున్న కెసిఆర్‌కు చెంపపెట్టులాంటిదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ న్యాయాన్ని నమ్ముకుందని, ఆ న్యాయమే తమను కోర్టులో గెలిపించిందని, ప్రజల మద్దతుతోనే ముందుకెళుతున్నామని ఆయన చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కెసిఆర్‌కు కనువిప్పు కలగాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ఈ కేసులో చివరకు న్యాయమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. కెసిఆర్ తాను తీసిన గోతిలో తానే పడ్డారని ఆయన అన్నారు. తాను చేయని తప్పుకు బాధ్యుడిని చేసి మానసికంగా వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా తనను ఏమీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కెసిఆర్ నిరంకుశ పాలనపై ప్రజల్లో చైతన్యం తేవాలని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

Uttam Comments on High Court Judgment in Congress MLAs Case

Comments

comments