Search
Friday 20 April 2018
  • :
  • :

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

KIDS

నిజామాబాద్ : ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు జన్మించారు. ఈ ఘటన నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో సోమవారం జరిగింది. కామారెడ్డి జిల్లా హజీపూర్ తండాకు చెందిన శోభ అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ నిజామాబాద్ ఆస్పత్రికి వచ్చింది. ఈ క్రమంలో ఆమె నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. నలుగురు పిల్లల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురిలో ముగ్గురు పిల్లలు తక్కువ బరువుతో జన్మించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం వాళ్లను నీలోఫర్ ఆస్పత్రికి తరలించామని వైద్యులు తెలిపారు. 24 వారాల్లోనే ప్రసవం కావడంతో శిశువులు తక్కువ బరువుతో జన్మించారని, తల్లి ఆరోగ్యంగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు.

Woman Gave Birth to Four children at a Time

Comments

comments