Search
Friday 20 April 2018
  • :
  • :

పాతబస్తీ అభివృద్ధికి కృషి : కెసిఆర్

CM-KCR

హైదరాబాద్ : పాతబస్తీ అభివృద్ధికి కృషి చేస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. మైనార్టీ వ్యవహారాలు, పాతబస్తీకి సంబంధించిన అంశాలపై ఆయన అధికారులతో సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెయ్యి కోట్ల రూపాయలతో పాతబస్తీలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సిఎం చెప్పారు. మౌలిక సదుపాయల కోసం త్వరలోనే తాను పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తానని ఆయన పేర్కొన్నారు. రంజాన్ నెల ప్రారంభానికి ముందే తాను పాతబస్తీలో పర్యటిస్తానని, వరదలకు తావు లేకుండా పాతబస్తీని తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. మూసీ నది ప్రక్షాళన, మెట్రో రైలు పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సిఎస్ ఎస్‌కె జోషి, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ, జిహెచ్‌ఎంసి అధికారులు పాల్గొన్నారు.

Working for Hyderabad Old City Development : CM KCR

Comments

comments