Search
Friday 25 May 2018
  • :
  • :

జల సమాధి

killed-image

15 మృతదేహాలు లభ్యం
ఇంకా కానరాని మరికొన్ని మృతదేహాలు
గల్లంతైన లాంచిని వెలికితీసిన రక్షణ బృందాలు
60 అడుగుల లోతు ఇసుకలో కూరుకుపోయిన లాంచి
ఆర్తనాదాలతో గోదావరి తీరం
బోరున విలపిస్తున్న కుటుంబీకులు
నిర్లక్షమే నిండు ప్రాణాలను బలి తీసుకుంది

మన తెలంగాణ/భద్రాచలం: గోదారమ్మ తల్లి ఒడిలో సాగే అడవిబిడ్డలను అదే తల్లి జల సమాధి చేసేసిందే. మంగళవారం సాయం త్రం 5 గం. ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలంలోని మంటూ రు, ఓడపల్లి గ్రామాల సమీపంలోని గోదావరి నదిలో ఈదురుగాలులకు చి క్కుకుని నీట మునిగిపోయింది. మం గళవారం మధ్యాహ్నానికి నీట ము నిగిన లాంచిని రెస్కూ బృం దాలు కనుగొని పెద్ద క్రేన్ సహాయంతో బయటకు తీశాయి. గోదావరి నదిలో మునిగిపోయిన లాం చి సుమారు 60 అడుగల లోతులోకి పోయి ఇసుకలో కూరుకుపోయింది. లాంచీ మునిగిపోయే సమయంలో పెద్ద ఎత్తున ఈదురు గాలులు రావడంతో లాంచీకి చెందిన కిటికీలు అన్ని మూసేసి నిర్వాహకులు లాంచీని నడపడంలో నిర్లక్షం వహించడం వల్లే  ప్రమాదానికి గురైందని ప్రమా దం నుండి బయటపడిన వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. కాగా బయటకు తీసిన లాంచీ అద్దాలను పగులగొట్టి అందులో ఉన్న సుమారు 12 మృతదేహాలను బయటకు తీశారు. మరో మూడు మృతదేహాలు నదిలో జల సమాధి లభ్యమయ్యాయి. దీంతో లాంచీ ప్రమాదంలో జలసమాధి అయిన వారిసంఖ్య 15కి చేరింది. లాంచీలు సుమారు 55 మంది ప్రయాణిస్తున్నటు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ప్రమాదానికి గురవుతుండగా సుమారు 22 మంది వరకు తప్పించుకుని ఈదుకుంటూ ఒడ్డుకుచేరుకున్నట్లు తెలుస్తోంది. వీరు కాకుం డా సుమారు 35 మంది నదిలో మునిగి జల సమాధి అయినట్లు అంచనా వేస్తున్నారు. కేవలం 15 మృతదేహా లు మాత్రమే లభ్యం కావడంతో మిగిలి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అసలు మిగతా మృతదేహాలు ఉన్నాయా లేదా అనేది కూడా అంతుపట్టడం లేదు. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి అక్కడికక్కడే శవపంచానామా నిర్వహిస్తున్నారు. మృతుల్లో పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. లాంచీ మునిగిపోయిన ఆ ప్రదేశం పూర్తి దట్టమైన ఏజెన్సీ ప్రాంతం కావడం, అందునా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండటంతో గత మూడురోజులుగా విద్యుత్ సరఫరా కూడా లేనట్లు తెలుస్తోంది. దీంతో ఆ ఏజెన్సీ ప్రాంతంలో లాంచీ ప్రమాదానికి గురైన సమాచారం కూడా లేదని వార్తలు వినవస్తున్నాయి. 15 మృతదేహాలు లభ్యం కాగా వాటిలో 7 మృతదేహాలు ఎవరికి చెందినవోఅంతుబట్టడం లేదు. ఈ మృతదేహాలు తమ కు చెందినవే అని అడిగే వారు లేకపోవడం గమనార్హం.

నిర్లక్షం ఖరీదు నిండు ప్రాణాలు :- లాంచీ నిర్వాహకుడు, డ్రైవర్ నిర్లక్షం వల్లే ఇంతపెద్ద ప్రమాదం చోటు చేసుకుని జల సమాధి కావాల్సిన పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. ఓడపల్లి సమీపంలో జనాలతో పాటు పెద్ద ఎత్తున సిమెంట్ సంచులను కూడా లాంచీలు ఎక్కించారని తెలుస్తోంది. కాగా నది మధ్యలో లాంచీ ప్రయాణిస్తున్న సమయంలో ఈదురు గాలులు పెద్దఎత్తున రావడంతో లాంచీని ఒడ్డుకు చేర్చి నిలిపేయాలని ప్రయాణికులు కోరినప్పటికీ లాంచీ డ్రైవర్ పట్టించుకోలేదని అంటున్నారు. అప్రమత్తంగా వ్యవహరించి లాంచీని ఒడ్డుకు చేర్చి ఉంటే ప్రణాలు దక్కేవని ప్రమాదం నుండి బయటపడ్డ ప్రయాణికులు అంటున్నారు. ఎవరికి వారు ప్రాణాలు కాపాడుకునేందుకు నదిలో దూకు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చామని, మిగతా వారిని రక్షించేందుకు కూడా ఎలాంటి అవకాశం లేదని అంటున్నారు.

భోరున విలపిస్తున్న కుటుంబీకులు :- నదిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల వారు బోరున విలపిస్తున్నారు. కొద్దిసేపటికి ఇళ్లకు చేరుకుంటారని అశిస్తే శవాలై కనిపించారని ఆర్థనాధాలు పెడుతున్నారు. లభ్యమైన మృతదేహాల్లో తమ వారు లేరని, వారి దేహాలు గల్లంతయాయ్యని, ఎలాగైనా వెతికి అందించాలని కోరుతున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్,ఎస్‌డిఆర్, ఫైర్, నావీ టీమ్‌లు నదిలో గాలింపు చర్యలు చేస్తున్నాయి. కాగా అసలు లాంచీలు ఎంతమంది ఉన్నారు.. ఎంత మంది చనిపోయారో కూడా లెక్కలు లేవు. దీనిని బట్టి చూస్తే లాంచీ నిర్వాహకుల పనితీరు ఎలా ఉందో అద్దం పడుతోంది.

Comments

comments