Search
Monday 21 May 2018
  • :
  • :

2022 నాటికి 175 గిగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం

int

ఐక్యరాజ్య సమితి : 2022 నాటికి 175 గిగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి లక్షంగా నిర్దేశించుకున్న ఇండియాలో 3 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఐక్యరాజ్య సమితి ఓ ప్రకటనలో తెలపింది. లక్షంగా పెట్టుకున్న విద్యుత్‌ని  సోలార్, వాయు సెక్టార్ల నుంచి ఉత్పతి చేయాలని భాతర్ నిర్ణయించిందని అంతర్జాతీయ కార్మక సంస్థ తెలిపింది. ప్రతి యేటా అంతర్జాతీయ మార్కెట్‌లో ఉద్యోగ అవకాశాల మీద సర్వే నిర్వహించి నివేదిక విడుదల చేసే ఈ సంస్థ వాతావరణ మార్పుల సవాళ్లను ఎదుర్కోవడంలో మిలియన్ల ఉద్యోగాలు అనివార్యమవుతాయని ప్రకటించింది. అంతేకాకుండా సాంప్రదాయ కర్మాగారాల్లో వ్యర్థాలను తగ్గించడానికి మరింత మంది ఉద్యోగులు అవసరమవుతారని చెప్పింది. 2030 నాటికి అంతర్జాతీయంగా  24 మిలియన్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, ప్రభుత్వాలు మావన జీవణ ప్రమాణాలు పెంచడానికి ఉపయోగపడే విధానాలు, సామాజిక సమానత్వం  సాధించడానికి అనుసరించే పద్ధతులు,  సవాళ్లను ఎదుర్కోవడం, పర్యావరణంలోని కొరతని అధిగమించే పనులు చేపట్టడం వంటి చర్యలు వల్ల ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. భారత్ 2022 నాటికి నిర్దేశించుకున్న 175 గిగా వాట్స్ విత్యుత్ ఉత్పత్తిని పునరుత్పాదక వనరుల నుంచి సాధించాలని నిర్ణయించిందని వాల్డ్ ఎంప్లాయిమెంట్ అండ్ సోషల్ అవుట్ లుక్ తన నివేదికలో తెలిపింది.

Comments

comments