Search
Monday 21 May 2018
  • :
  • :

లాంచీ ప్రమాదంలో 22 మంది మృతి

22 People died with Boat drowning in Godavari River

తూర్పుగోదావరి : గోదావరిలో లాంచీ మునిగిన ఘటనలో 22మంది చనిపోయారు. ఇప్పటి వరకు 12 మంది మృతదేహాలను వెలికి తీశారు. మరో 10 మృతదేహాల కోసం నేవీ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటన్థాలి హృదయవిదారకంగా మారింది. మృతదేహాలకు ఘటనాస్థలిలోనే పోస్టుమార్టం చేసి, వారివారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. నదిలో 60 అడుగుల లోతులో ఉన్న లాంచీని భారీ క్రేన్ల సహాయంతో బుధవారం ఉదయం వెలికి తీశారు. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం జరిగిన విషయం తెలిసిందే. ఘటన్థాలిని ఎపి సిఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. దగ్గరుండి ఆయన సహాయ చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు. మృతుల కుటుంబాల్లో చదువుకున్నవారు ఉంటే ఉద్యోగం ఇస్తామని, బాధితుల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తామని చంద్రబాబునాయుడు తెలిపారు. భవిష్యత్‌లో పడవ ప్రమాదాలు జరగకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. దేవీ పట్నం ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

22 People died with Boat drowning in Godavari River

Comments

comments