Search
Friday 25 May 2018
  • :
  • :

12 మృతదేహాలు వెలికితీత

ph

 మరికొన్నింటి కోసం గాలింపు 

గోదావరి లాంచీ ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరం 

రూ.10లక్షల చొప్పున పరిహారం : చంద్రబాబు 

మన తెలంగాణ/హైదరాబాద్ : గోదావరిలో లాంచీ మునక ప్రమాదంలో మొత్తం 22 మంది మృతి చెందినట్లు అధికారులు బుధవారం స్పష్టం చేశారు. గోదావరిలో మునిగిన లాంచీని ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఒడ్డుకు తీసుకువచ్చాయి. లాంచీ అద్దాలు పగులగొట్టి ఇద్దరు బాలురు సహా 12 మంది మృతదేహాలను వెలికితీశారు. మృతు ల్లో కవల పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. మరో 10 మంది మృతదేహాల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృం దాలు గాలిస్తున్నాయి. బాధితుల కుటుంబ సభ్యు ల రోదనలతో ఘటనా స్థలం మార్మోగిపోయింది. అంతటా విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలంలో జరుగుతోన్న సహాయక చర్యల ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు పలువురు మంత్రులతో కలిసి పర్యవేక్షించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ మృ తుల కుటుంబాలకు తలా రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని, తక్షణ సా యం కింద లక్ష రూపాయలు అందజేస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, ఈ ఘటనలో మరో ముగ్గురి ఆచూకీ, వివరాలు తెలియాల్సి ఉందని అన్నారు. బోటులో సిమెంటు బస్తాలు తీసుకురావడం ప్రమాదానికి మరో కారణమని తెలిపారు. ఈదురుగాలులు, వర్షం రావడంతో లాంచీని ఒడ్డుకు చేర్చాలంటూ ప్రయాణికులు ఎంత మొత్తుకున్నా లాంచీ డ్రైవర్ వినలేదు. అం తేకాకుండా ప్రయాణికులను సముదాయించేందుకు అందర్ని క్యాబిన్‌లోకి పంపించి తలుపులు కిటికీలు మూసివేశారు. ఫలితంగానే లాంచీ కప్పు పైన కూర్చున్న 15 మంది ఈదుకుంటూ తప్పించుకున్నారు. క్యాబిన్ లోపల ఉన్నవారు జల సమాధి అయ్యా రు. తలుపులు, కిటికిలు మూసివేయకుంటే మరికొంత మంది ప్రయాణికులు తప్పింకునే అవకాశాలు ఉండేవి. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం మంటూరు వద్దమంగళవారం సాయంత్రం లాంచీ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యాల వల్లే తరచు బోటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వైఎస్‌ఆర్‌సిపి నేత పార్ధసారధి పేర్కొన్నారు.

ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు: ఎపి హోంమంత్రి

గోదావరిలో తిరుగుతున్న లాంచీల కండిషన్ ఎలా ఉంది, అనుమతులు ఉన్నాయా, లేవా అనే దానిపై అధికారులు తనిఖీలు చేశారని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. 1991లో ప్రమాదానికి గురైన లక్ష్మీ వెంకటేశ్వర లాంచీ మళ్లీ తిరగడానికి అనుమతులు ఉన్నాయా, లేదా అన్న దానిపై మంత్రి స్పందించారు. సహాయ చర్యలు పూర్తయిన తరువాత అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. ప్రమాదానికి కారనమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Comments

comments