Search
Monday 21 May 2018
  • :
  • :

లాంచీ మునక

50 people were missing in the luncheon accident

ఆంధ్రప్రదేశ్‌లోని దేవిపట్నం వద్ద ఘటన
35 మంది గల్లంతు

మన తెలంగాణ/ హైదరాబాద్ : తూర్పుగోదావరిజిల్లా దేవిపట్నం మండలం మంటూరు వద్ద మం గళవారం సాయంత్రం గోదావరి నీటిలో (ఉభయగోదావరి జిల్లాల మధ్య) లాంచీ నీట మునిగిపోయింది. ప్రమాద సమయంలో లాంచీలో 42 మంది ప్రయాణికులు ఉన్నారని సమాచారం. వీరిలో ఏడుగురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతయిన 35 ప్రయాణికుల కోసం పోలీసులు, సమీప ప్రాంతాల్లోని గిరిజనులు గాలిస్తున్నారు. గల్లంతయిన వారిలో పెళ్లి బృందం కూడా ఉన్నట్లు తెలిసింది. పోలవరం నుంచి కొండమొదలు వెళ్తుండగా సాయంత్రం 4.30-5.00 గంటల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. లాంచీ ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో ప్రయాణికులంతా దిగడం కోసం ఒకేవైపుకు రావడంతో లాంచీ వంగిపోయి నీటిలో మునిగినట్లు ఆ రాష్ట్ర అధికారులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో పర్యటకుల హాహాకారాలు విన్న గిరిజనులు నాటు పడవలో వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. మిగ తా ప్రయాణికుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. గల్లంతయిన వారిలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నట్లు సమాచారం. ఈ లాంచీ ప్రతీరోజు దేవిపట్నం నుండి కొండమొదలుకు ప్రయాణికులను చేరవేస్తుందని, ఆ విధంగానే మంగళవారం వారాంతపు సంత ముగించుకున్న తరువాత ఈ లాంచీ ప్రయాణీలకుతో బయల్దేరినట్లు తెలిపారు. లాంచీ మునిగిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఉభయగోదావరి జిల్లాల ఎస్‌పిలతో ఫోన్‌లో మాట్లాడి పోలీసులను అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను తక్షణం తరలించాలని ఆదేశించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు బయల్దేరి వెళ్లాయి. పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. -ప్రమాదానికి గురైన లాంచీ లక్ష్మీవెంకటేశ్వర సర్వీస్‌కు చెందినది. లాంచీ డ్రైవర్ ఖాజా వలి దేవిపట్నం పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. నాలుగు రోజుల క్రితమే గోదావరిలో లాంచీలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన ఘటన ఇంకా మరవకముందే అదే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Comments

comments