Search
Friday 25 May 2018
  • :
  • :

వడ దెబ్బతో ఉపాధి కూలీ మృతి

A Man Dies with Sun Stroke
కోహీర్: వడదెబ్బకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన కోహీర్ పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాము కథనం ప్రకారం… పట్టణంలోని సంజీవ్ నగర్ కాలనీకి చెందిన ముక్కంగారి నర్సింహులు (50)కు అయిదు గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. నర్సింలు ఉపాధి పథకంలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. రోజు లాగానే గురువారం సైతం పని చేసేందుకు అధికారులు చూపించిన ప్రాంతానికి వెళ్లాడు. పని చేస్తుండగా అకస్మాత్తుగా నర్సింలు కింద పడి పోవడంతో కూలీలందరూ అక్కడికి చేరుకుని నర్సింలుకు పరిచర్యలు చేస్తుండగా నర్సింహులు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము వివరించారు.
కుటుంబాన్ని ఆదుకోవాలి…
నిరుపేద కుటుంబమైన నర్సింహులుకు 5 గురు కూతుళ్లు, ఒక్క కుమారుడు ఉండగా కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. ఇంటికి పెద్ద దిక్కు అయిన నర్సింహులు మృతితో ఆ కుటుంబం రోడ్డు పాలయ్యే అవకాశాలు ఉన్నాయని గ్రామస్థులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి దిక్కు లేకపోవడంతో ఆ కుటుంబం వీధుల పాలు కాకుండా ఉండేందుకు ప్రభత్వం ఆదుకోవాలని గ్రామస్థులు వినతి చేస్తున్నారు.

Comments

comments