Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి

 Worker killed by electric shock

ఐడిఏబొల్లారం:విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృత్యువాత పడిన సంఘటన బొల్లారం పోలీస్‌స్టేషన్ పరధిలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి సిఐ సతీష్‌రెడ్డి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. యానాం కు చెందిన సిహెచ్ వీరభద్రం(52) బొల్లారం పారిశ్రామిక వాడలోని సిరి కెమికల్స్‌లో పని చేసుకుంటు కుటుంబ సభ్యులతో కలిసి పరిశ్రమలోనే సర్వెంట్ క్వాటర్‌లలో ఉంటున్నాడు. కాగా బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పరిశ్రమలో పెద్ద శబ్దం రావడంతో బయటకు వచ్చి చూసి పరిశ్రమలోని ల్యాండ్ ఫోన్‌ను పట్టుకొని పరిశీలించగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్ప కూలి పోయాడు . విషయం గమంచిన అతని భార్య సెక్యూరిటీకి సమాచరం ఇవ్వగా నగరంలోని అసుపత్రికి తరలించారు. అప్పటికే వీరభద్రం మృతి చెందినట్టు డాక్టర్‌లు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Comments

comments