Search
Monday 21 May 2018
  • :
  • :

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య

A woman's suicide for the her husband and her aunt

వాంకిడి: మండలంలోని తలండి గ్రామానికి చెందిన దుర్గం జ్యోతి (36) పురుగుల మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తండ్రి తాక్సాండె భగవంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలంలోని జన్కాపూర్‌కు చెందిన భగవంత్‌రావు మూడో కూతురు జ్యోతికి వాంకిడి మండలంలోని తలండి గ్రామానికి చెందిన దుర్గం చంద్రశేఖర్‌తో 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మారుతి అనే కుమారుడు జన్మించి ఏడేళ్ల క్రితం చనిపోయాడు. చనిపోయిన తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న జ్యోతికి సంతానం కాదని, భార్త మగ సంతానం కావాలని రెండవ పెళ్లికి ఒప్పుకోవాలని భార్త చంద్రశేఖర్‌తో పాటు అత్తమామలు ఆమెను తరచు వేధించేవారని తండ్రి ఆరోపించారు. ఇదే క్రమంలో బుధవారం రాత్రి జ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమెను చికిత్స నిమిత్తం ఆసిఫాబాద్ ప్రభుత్వ దవాఖానాకు తరలిస్తున్నట్టు అల్లుడు చంద్రశేఖర్ ఫోన్ చేసి చెప్పినట్టు, ఆసుపత్రికి వెళ్లి చూడగా జ్యోతి మృతి చెంది ఉందని తండ్రి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు.

Comments

comments