Search
Friday 25 May 2018
  • :
  • :

అర్జున్, విజయ్ ఆంటోని కాంబినేషన్‌లో…

Action King Arjun teams up with Vijay Antony

జెంటిల్‌మెన్, ఒకే ఒక్కడు వంటి సినిమాల ద్వారా టాలీవుడ్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న  తమిళ నటుడు అర్జున్. అతను అడపాదడపా తెలుగులో స్ట్రెయిట్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘నా పేరు సూర్య…’లో అల్లు అర్జున్ తండ్రిగా ఆయన కనిపించడం సినిమాకు బాగా ప్లస్ అయింది. గతంలో రామ్‌తో ‘రామ రామ కృష్ణ కృష్ణ’, నితిన్‌తో ‘శ్రీ ఆంజనేయం’ చేసిన అర్జున్ యూత్ హీరోలతో సినిమా చేసే అవకాశాలను అంత సులభంగా వదిలి పెట్టడు. 50 ఏళ్ల వయసులో కూడా మంచి ఫిట్‌నెస్‌తో యంగ్ హీరోలకు ధీటుగా రాణిస్తున్నాడు అర్జున్. అయితే ఈ సీనియర్ నటుడు విజయ్ ఆంటోనీతో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. కొత్త దర్శకుడు ఆండ్రూ రూపొందించబోయే ‘కోలైక్కరన్’లో నటించేందుకు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రంలో అర్జున్‌కు చాలా కీలకమైన పాత్రను ఆఫర్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం విజయ్ ఆంటోని ప్రతి చిత్రం తెలుగులో డబ్ అవుతోంది. కాబట్టి విజయ్, అర్జున్ కాంబినేషన్‌లోని ఈ మూవీ కూడా తెలుగులో వస్తుంది.

Comments

comments