Search
Monday 21 May 2018
  • :
  • :

భారత రాజ్యాంగాన్నిఎన్ కౌంటర్ చేసిన గవర్నర్…

Congers

న్యూఢిల్లీ:  కర్నాటక గవర్నర్ వాజుభాయ్ వాలా పై కాంగ్రెస్ విరుచుకుపడింది. ఆయన భారత రాజ్యాంగాన్ని రెండుసార్లు ఎన్ కౌంటర్ చేశారంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంతో మోడీ కోసం గుజరాత్ లో తన సీటు త్యాగం చేశారని స్పష్టం చేశారు.  ఇప్పుడు ఏకంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్నే గవర్నర్ త్యాగం చేశారని మండిపడ్డారు. బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించి మొదటి సారి రాజ్యాంగాన్ని బాజుభాయ్ వాలా ఎన్ కౌంటర్ చేశారని చెప్పారు. గురువారం యడ్యూరప్పతో ప్రమాణస్వీకారం చేయించి రెండోసారి రాజ్యాంగాన్ని ఎన్ కౌంటర్ చేశారని సూర్జేవాలా విమర్శలు గుప్పించారు.  యడ్యూరప్ప కు సిఎం కూర్చీ ఒక రోజు ముచ్చటన్నారు. అందులోంచి సగం రోజూ గడిచిపోయిందని సూచించారు.

Comments

comments