Search
Monday 21 May 2018
  • :
  • :

చిన్న నగరాలకు ఎయిర్ పోర్టులు ఎప్పుడో?

 Airports for small cities

మన తెలంగాణ / హైదరాబాద్ :  మంత్రి అశోక గజపతి రాజు రాజీనామా చేయడంతో ఆ పథకం కొనసాగింపు పురోగతిపై స్పష్టత లేకుండా పోయింది. ఆ యన రాజీనామాతోనే ఆ కార్యక్రమం కూడా వెనక్కి వెళ్లిం దా అనే అనుమానాలూ లేకపోలేదు. ఆయన స్థానంలో నూతనంగా బాధ్యతలను చేపట్టిన సురేష్ ప్రభు తెలుగు రాష్ట్రాల విమాయనయాన రంగం విషయంలో శ్రద్ద తీసుకుంటారా అనే సందేహాలు ప్రస్తుతం నెలకొన్నాయి. సురే ష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ నుండే రాజ్యసభకు ప్రాతినిధ్యం వ హిస్తున్నందు వల్ల తెలుగు రాష్ట్రాల అభివృద్ధి పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి వెళ్లరని కూడా కొందరు విశ్లేషిస్తున్నా రు. అయితే కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక పలు సందర్భాల్లో విమానయాన రంగానికి సంబంధించిన అ న్ని సమావేశాలు తెలంగాణ కేంద్రంగానే జరిగినా చిన్న నగరాలకు ఎయిర్ పోర్టుల విస్తరణ అంశాన్ని మాత్రం ప్రస్తావించడం లేదు. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఈ అం శంలో చిత్తశుద్ధితో సహకరిస్తే తెలుగు రాష్ట్రాల్లో విమానాశ్రయాల ఏర్పాటు పెద్ద సమస్య ఏమీ కాదని పలువురు గుర్తుచేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పథకం ప్రాంతీయ విమానయాన అనుసంధాన కార్యక్రమాన్ని అమలు చే స్తోందని, దీని ద్వారా చిన్న ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు వీలు ఉందని చెబుతున్నారు. ప్రైవేటు రంగంలో శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న నేపథ్యంలో శం షాబాద్ చుట్టుపక్కల 40 కి.మీ దూరం వరకు కొత్తగా ఎ లాంటి విమానాశ్రయాలను ఏర్పాటు చేయకూడదన్న ని బంధన జిఎంఆర్ ఏయిర్ పోర్టు ఎంఓయూలో ఉండడం తో 40కి.మీ దూరం ఉన్న పట్టణాల్లో చిన్న విమానాశ్రయాలను ఏర్పాటు చేసుకునే వీలు ఉండనుంది.

ఖమ్మం జిల్లా కొత్తగూడెం, ఆదిలాబాద్, వరంగల్ లాంటి జిల్లా కేంద్రాలకు విమాన సర్వీసులకు అనువుగా ఉంటాయని ఏవియేషన్ రంగ అధికారులు గతంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదికలను కూడా ఇచ్చారు. ఈ క్రమంలో కేంద్ర పౌర విమానయాన సంస్థ ప్రాంతీయ విమానయాన అనుసంధాన కార్యక్రమంలో కొత్తగూడెం, ఆదిలాబాద్‌లను ఎంపిక చే సింది. ఆదిలాబాద్ నగరంలో పాత విమానాశ్రయం ఇప్పటికే ఉంది. దీనిని ఆధునీకరిస్తే చాలని ఆ జిల్లా యం త్రాంగం ప్రభుత్వానికి, కేంద్ర పౌర విమానయాన శాఖకు కొద్ది నెలల క్రితం హైదరాబాద్‌లో జరిగిన వింగ్ ఇండి యా ఏవియేషన్ ప్రదర్శన, సదస్సు సందర్భంగా విజ్ఞప్తి చేసింది. దాదాపు గడచిన మూడేళ్లలో ఇప్పటివరకు రెండు పర్యాయాలు హైదరాబాద్ కేంద్రంగానే  ఘనంగా ఏవియేషన్ ప్రదర్శనను అయితే ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం వి మానాశ్రయాల ఏర్పాటుపై మాత్రం ముందుకెళ్లడం లేదు. ప్రస్తుతం తెలంగాణ మొత్తానికి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రమయం ఒక్కటే గగనయానానికి అందుబాటులో ఉండగా, చిన్న పట్టణాలకు కలగానే మిగిలిపోతోం ది. అశోకగజపతి రాజు మంత్రిగా ఉన్న సమయంలో తె లుగు రాష్ట్రాల్లో కనీసం 10 జిల్లాలకు అయినా విమానయాన సర్వీసులు నడపాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్షంగా కనిపిస్తోందని చెప్పారు. తెలంగాణలో కొత్తగూడెం,ఆదిలాబాద్, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గన్నవరం ఏయి ర్ పోర్టు విస్తరణ, వైజాగ్ కేంద్రంగా భోగాపురంలోనూ కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ ఏయిర్ పోర్టులు సాకారం అయి ఉం టే ఆయా పట్టణాల్లో విమాన విడిభాగాలు, వాటి రిపేరుకు సంబంధిత పరిశ్రమలకు డిమాండ్ ఉండేదని ఏవియేషన్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇది మౌలిక వసతులపరంగా ఏవియేషన్‌రంగపరంగా అభివృద్ధి కూ డా ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు.

Comments

comments