Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్

Airtel Launched New Plan for Prepaid Customers with Rs.149

ముంబయి: టెలికాం రంగంలో ఎన్నో సంచలనాలకు కేంద్రబిందువైన రిలయన్స్ జియోకు పోటీగా ఇతర టెలికాం ఆపరేటర్లు వరుసగా కొత్త ప్లాన్‌లతో తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా భారతి ఎయిర్‌టెల్ మరో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. జియో 149 ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఈ నూతన ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ. 149 పెట్టి రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు 28 రోజుల వరకు ఉచితంగా పొందవచ్చు. కాగా, జియో ఇదే రూ. 149 ప్లాన్‌లో రోజుకు 1.5జిబి డేటా అందిస్తున్న సంగతి తెలిసిందే.

Comments

comments