Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్ అదిరిందంతే…

airtel free roaming offer all over india from april 1st 2017

ముంబయి: రిలయన్స్ జియో పోటీని తట్టుకుని తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు మిగతా టెలికాం ఆపరేటర్లు సరికొత్త ఆఫర్లను తీసుకొస్తున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ తన ప్రిపెయిడ్ వినియోగదారుల కోసం మరో సరికొత్త ప్లాన్‌ను తీసుకోస్తోంది. రూ. 558తో రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు రోజుకు 3జిబి డేటా, ఉచిత అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్‌ఎంఎస్‌లు అందించనుంది. ప్రస్తుతం ఈ ప్లాన్ దేశ రాజధాని ఢిల్లీ సర్కిల్‌లో అందుబాటులో ఉంది. కాగా, త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని సర్కిళ్లలోనూ ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక జియో రూ. 498 ప్లాన్‌లో రోజుకు 2బిజి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌ను 91 రోజుల కాలపరిమితితో అందిస్తున్న సంగతి తెలిసిందే.

Comments

comments