Search
Monday 21 May 2018
  • :
  • :

ఆమ్‌చూర్ (టంకర)తయారీతో ఉపాధి పొందుతున్న మహిళలు..

Amchur making process in medak

జోగిపేటః ఎండకాలం ఆరంభమై చాలా రోజులైంది..మామిడి కాయలు కూడా కోతకోస్తున్నాయి..దీంతో కొన్ని కుటుంబాలకు జీవనాధారమవుతుంది. వేసవిలో పండిన మామిడి కాయలను ఆమ్‌చూర్ (మామిడి టంకర) చేసేందుకు కూలీలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇక ఈ వ్యాపారంపై ఆధాపడిన వారు మామిడి తోటలలోనే ఉంటు కాలం వెల్లదీస్తూ, ఆమ్‌చూర్ ఉత్పత్తికి చెమటోడుస్తున్నారు. పల్లె ప్రాంతాల్లో ఆంచూర్‌కు అంత ప్రముఖ్యత లేకపోయినా పట్టణ ప్రాంతాల్లో ఆంచూర్ అంటే లోట్టలేసుకుని తినేవారు కొక్కొల్లలు. ఆవాకాయకు మామిడి కాయలు ఏంత ప్రసిద్దో పట్టణ ప్రాంతాల్లో ఆమ్‌చూర్‌కు అంతే ప్రముఖ్యత ఉందని చెప్పవచ్చు. ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని పుల్‌కల్, అల్లాదుర్గం, ఆందోల్ మండలాల్లో ఈ మామిడి టంకర (ఆమ్‌చూర్) తయారీపై ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ వ్యాపారాన్ని నమ్ముకున్న వారు వేసవి ఆరంభం కంటే ముందే మామిడి తోటల యజమానులతో తోటలను కౌలుకు మాట్లాడుకుంటారు. మరికొంత మంది మామిడి తోటలను కాతను బట్టి ధరను నిర్ణయించి పట్టుకుంటారు. మామిడి పింద దశనుండి వాటిని కాపాడుకునేందుకు పిల్లజల్లలతో కలిసి తోటలలోనే ఉంటూ నానా కష్టాలు పడుతారు. ఈదురుగాలు వచ్చి కాయలు నేలరాలిపోతే తాము పెట్టిన పెట్టుబడి, పడుతున్న కష్టం వృధా అవుతుందేమోనని గుండెలు బాదుకుంటారు. ఏది ఏమైనప్పటికి మామిడి కాయలను నమ్ముకున్న ఆ అభాగ్యులు కంటిమీద కునుకు లేకుండా కాలం వెల్లదీస్తారు. ఆందోల్ మండల పరిధిలోని కొండరెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లి, అక్సాన్‌పల్లి తదితర గ్రామాలలో ఆమ్‌చూర్ తయారీతో ఆయా గ్రామాల మహిళలు ఉపాధి పొందుతున్నారు.
ఆమ్‌చూర్ తయారీ విధానం 
తోటలో కాసిన మామిడి కాయలను కోసి ఆమ్‌చూర్ (మామిడి టంకర) తయారు చేస్తారు. ఆంచూర్ తయారీలో స్థానిక మహిళ కూలీలు నిడపట్టుకు ఉండి మామిడి కాయాల తొక్కును తీయడం, వాటిని సన్నగా కోస్తు గంపలలో నింపుతారు. ఇలా పని చేయడంతో వారికి రోజుకు కూలీ రూపంలో ఉపాధితో పాటు ఉల్లసం కూడా లభిస్తుంది. పీచు కట్టిన మామిడికాయలను ముందుగా కశికలతో వాటి తొక్కును తీస్తారు. అనంతరం పోడువుగా ఆకారంగా ఉండేలా సన్నగా కట్‌చేస్తారు. ఇలా కట్‌చేసిన వాటిని ఒరుగు అంటారు. దీన్ని ఎండలో అరబోసి ఎండబెడ్తారు. ఎండిన తర్వాత మామిడి ఒరుగును నిజామాబాద్, హైదారాబాద్ ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తారు. అక్కడ దాదాపుగా రూ.1800 నుండి రూ.24 వందల వరకు ఒరుగు రంగును బట్టి, వాటి నాణ్యతపై ధర వస్తుందని ఆంచూర్ వ్యాపారులు చెబుతున్నారు.
ఈ యేడు మామిడి కాత తక్కువే : రాజన్నళ్ల కుమార్ (ఆంచూర్ వ్యాపారి, కొండారెడ్డిపల్లి).
గత సంవత్సరం కంటే ఈ యేడు మామిడి కాత తక్కువగా కాసింది. అందులో ఇటీవల వడగండ్ల వర్షం, ఈదురుగాలుల వల్ల మామిడి కాయలకు కొంత నష్టం జరిగింది. ఎండలో కాయలను తెంపి చెట్లనిడలకు చేరుస్తాం. ఆ కాయలను మా కుటుంబ సభ్యులతో పాటు ఇరుగుపొరుగు మహిళలు కూడా ఆమ్‌చూర్ తయారీలో పాల్గొంటారు. వీరికి రోజుకు రూ. 250 కూలీ చోప్పున కట్టిస్తాం. దాదాపుగా మా వద్ద రోజుకు 8 నుండి పది మంది వరకు మహిళలు పని చేస్తున్నారు. వాతవరణం చల్లబడగానే ఆంచూర్ తయారీని నిలిపివేస్తాం. ఎండలేకపోతే ఒరుగు నల్లబడుతుంది. మార్కెట్లో తెల్లగా ఉన్న ఒరుగుకు మంచి ధర పలుకుంది. నల్లగా ఉంటే ధర పడిపొతుంది. ఏదిఎమైనా ఈ సారి ఎండలు మాకు సహకరించాయి.

Comments

comments