Search
Friday 25 May 2018
  • :
  • :

హైదరాబాద్ నెం.1

charminar

ఘన వ్యర్థాల నిర్వహణలో పురస్కారం

సిద్ధిపేటకూ స్థానం

మన తెలంగాణ/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటించింది. బుధవారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి మరియు గృహకల్పణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ జాబితాను విడుదల చేశారు. ఇందులో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ విభాగంలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలవగా, పదిలక్షల జానాభా జాబితా లో విజయవాడకు అగ్రస్థానం లభించింది. లక్ష పట్టణ జనాభా జాబితాలో సిద్దిపేటకు అగ్రస్థానం దక్కింది. సౌత్ జోన్ లో సిటిజన్ ఫీడ్ బ్యాక్ విభాగంలో లక్ష పట్టణ జనాభా జాబితాలో తెలంగాణ లోని బోడుప్పల్ మొదటి స్థానంలో నిలవగా, ఇన్నోవేషన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో లక్ష పట్టణ జనాభా జాబితాలో తెలంగాణలో పీర్జాదిగుట్ట మొదటిస్థానంలో నిలచింది. ఇక.. పరిశుభ్రమైన నగరాల జాబితాలో ఇండోర్‌కు మొదటి స్థానం రాగా.. భోపాల్‌కు రెండో స్థానం.. చండీగఢ్‌కు మూడో స్థానం లభించింది. ఈ అవార్డులకు కేం ద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద నిధులు అందుకునే 4203 స్థానిక సంస్థలను పరిగణలోకి తీసుకున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ సంవత్సరం జనవరి 4 నుండి 10మార్చి మధ్యకాలంలో అవార్డుల ఎంపికకోసం ప్రక్రియను నిర్వహించిన ట్లు తెలిసింది. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మొత్తం 37.66 లక్షల మం ది పౌరుల అభిప్రాయాలు తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అవార్డుల ప్రకటన సందర్భంగా వెల్లడించారు.
అత్యంత పరిశుభ్ర నగరం ఇండోర్
అంత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్ కాగా, భోపాల్, చండీగఢ్‌లు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు ప్రభుత్వ పరిశుభ్రత సర్వే వెల్లడించింది. దేశ వ్యాప్తంగా పరిశుభ్రత నగరాలను అంచనా వేసేందుకు ఈ సర్వే ఉద్దేశించింది. 2018 సంవత్సరానికి గానూ బుధవారం స్వచ్ఛ సర్వేక్షన్ ఫలితాలను గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. పరిశుభ్రత నిర్వహించే ఉత్త మ రాష్ట్రంగా జార్ఖండ్ కాగా, ఆ తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లు ఉన్నట్లు తెలిపింది. గత సర్వేలతో పోల్చితే ఈ ఏడాది పౌరుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తమ నిత్య జీవితంలో అనుభవాల ఆధారంగా వారు తమ అభిప్రాయాలను తెలిపారు. గత ఏడాది కూడా ఇండోర్ పరిశుభ్రమైన నగరంగా ఎంపికైంది. గత ఏడాది 430 నగరాల్లో సర్వే చేపట్టగా, ఈ ఏడాది దాదాపు 4200 నగరాల్లో సర్వే నిర్వహించామని మంత్రి తెలిపారు. బహుమతి ప్రదానోత్సవం రోజు పరిశుభ్రత నిర్వహణ ఏ మాత్రం బాగా లేని నగరాల పేర్లను కూడా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

Comments

comments