Search
Monday 21 May 2018
  • :
  • :

ప్లేఆఫ్ ఆశలు సజీవం

Bangalore Challengers win over Sunrisers

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) సిరీస్‌లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో గురువారం జరిగిన 51వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ నిర్దేశించిన 219 పరుగులను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఛేదించలేకపోయింది. దాంతో రాయల్ ఛాలెంజర్స్ 14 పరుగుల తేడాతో గెలుపొందారు. సన్‌రైజర్స్ తరఫున హేల్స్, ధావన్ ఓపెనర్లుగా దిగారు. 5.1 ఓవర్లో చాహల్, ధావన్(18)ని కాట్ అండ్ బౌల్డ్ చేశాడు. తర్వాత కేన్స్ విలియమ్సన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 7 ఓవర్లో మోయిన్ అలీ వేసిన చివరి బంతిలో హేల్స్(37)ను ఎబి డి విలియర్స్ కాచ్‌ఔట్ చేశాడు. దాంతో టిమ్ సౌథీ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఎనిమిదవ ఓవర్ వచ్చేసరికి సన్‌రైజర్స్ 2 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. పదవ ఓవరుకు స్కోరు 91కి చేరింది. 12.6 ఓవరుకల్లా విలియమ్సన్, మనీశ్ పాండే కలిసి తమ భాగస్వామ్యంలో 50 పరుగులు చేశారు. ఆట చివరికొచ్చే సరికి రాయల్ ఛాంటెంజర్స్ బౌలర్లు ఎక్కువ పరుగులు ఇచ్చేయసాగారు. కెప్టెన్ విలయమ్సన్ 2015 నుంచి ఆర్‌సిబికి వ్యతిరేకంగా ఆడిన వాట్లో ఏడు అర్ధశతకాలు(57, 52*,58, 92, 69,14,56,77*) చేశాడు. చివరి ఓవర్లో సిరాజ్ వేసిన బంతిని విలియమ్సన్(81) హిట్ చేయగా బౌండరి వద్ద గ్రాడ్హోం కాచ్ ఔట్ చేశాడు. పాండే విలియమ్సన్, పాండే తమ భాగస్వామ్యంలో 66 బంతులకు 135 పరుగులు చేశారు. అయినప్పటికీ వారి శ్రమ వృథా అయింది.
దీనికి ముందుసన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుకుంది. ఈ ఏడాది ఐపిఎల్ సీజన్‌లో ఇప్పటికే వీరిద్దరూ ఒకసారి తలపడినప్పుడు 5 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ జట్టు విజయం సాధించింది.రాయల్ ఛాలెంజర్స్ తరఫున ఓపెనర్లుగా పార్థీవ్ పటేల్, విరాట్ కోహ్లి క్రీజులోకి దిగారు. మొదటి ఓవరులో సందీప్ శర్మ వేసిన చివరి బంతిని షాట్ కొట్టబోయి పార్థీవ్ పటేల్(1) ఎస్ కౌల్ చేతిలో క్యాచ్‌ఔట్ అయ్యాడు. తరాత ఎబి డి విలియర్స్ బరిలోకి దిగాడు. పవర్‌ప్లేలో ఎబిడి విలియర్స్, విరాట్ కలసి ఆడడంతో మంచి ప్రదర్శన ఉండగలదని ప్రేక్షకులు ఎదురుచూశారు. భువిని ఆట నుంచి తప్పించి రెస్ట్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. అతడి బదులుగా బాసిల్ థంపిని తీసుకున్నారు. నాలుగో ఓవర్లోని 5వ బంతిలో రషీద్ ఖాన్, కోహ్లి(12)ని బౌల్డ్ చేశాడు. ఐదో ఓవరుకల్లా బెంగళూరు జట్టు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 39కి చేరింది. రైట్ ఆర్మ్ మీడియం ఆటగాడు సిద్ధార్త్ కౌల్ బరిలోకి వచ్చాడు. 6.5 ఓవర్లో గోస్వామి, మోయిన్ అలీ బంతిని క్యాచ్‌పట్టలేకపోయాడు. ఏడవ ఓవర్లో బాసిల్ థంపి వేసిన రెండు బంతులను మోయిన్ అలీ సిక్సర్లుగా కొట్టాడు. మోయిన్ అలీ 9.6 ఓవర్లో మరో సిక్సర్ బాదాడు. దానిని శిఖర్ ధావన్ కాచ్ పట్టాడు కానీ తాడు దాటి పట్టుకోవడంతో దానిని పరిగణించలేదు. 10.1 ఓవర్లో రషీద్ ఖాన్ వేసిన బంతిని మరో సిక్సర్‌గా మలిచాడు మోయిన్ అలీ. సిక్సర్లు దంచేయడంలో దిట్టలా కనిపించాడు. స్టేడియంలోని ప్రేక్షకులు ‘ఆర్‌ర్‌ర్‌ర్‌సిసిసిసిబిబిబిబి’ అని ఆనందంతో నినాదాలు చేశారు. 11.5 ఓవర్లో ఎస్.కౌల్ వేసిన బంతిని మరో సిక్సర్‌గా ఉతికిపారేశాడు మోయిన్ అలీ. అతడికి సరిజోడుగా ఎబి డి విలియర్స్ కూడా నిలదొక్కుకుని ఆడసాగాడు. చిన్నస్వామి స్టేడియంలో ప్రేక్షకుల గోలకి కామెంటరీ వినిపించడం కూడా కష్టమైపోయింది. బాసిల్ వేసిన పన్నెండవ ఓవర్లోని నాలుగో బంతిని ఎబి డి విలియర్స్ సిక్సర్‌గా హిట్ చేశాడు. 13.5 ఓవర్లో సందీప్ శర్మ వేసిన బంతిని మోయిన్ అలీ సిక్సర్‌గా కొట్టాడు. మోయిన్ అలీ, ఎబి డి విలియర్స్ బాగా ఆడుతున్నారనిపిస్తున్న సమయంలో 14.2 ఓవర్లో ఎబి డి విలియర్స్ క్యాచ్‌ఔట్ అయాడు. రషీద్ ఖాన్ వేసిన బంతిని ఆడిని ఎబి డి విలియర్ష్(69) ధావన్ క్యాచ్ పట్టేశాడు. దీంతో రషీద్ ఖాన్‌కు టి20ల్లో ఇది 150 వికెట్‌గా నమోదయింది. తర్వాత కోలిన్ డి గ్రాండ్హోమ్ క్రీజులోకి వచ్చాడు. 14వ ఓవర్లో రషీద్ ఖాన్ వేసిన నాలుగో బంతికి మోయిన్ అలీ(65) గోస్వామి చేతిలో క్యాచ్ ఔట్ అయాడు. దాంతో మందీప్ సింగ్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 15వ ఓవరుకల్లా బెంగళూరు జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు. 17.1 ఓవర్లో కౌల్ వేసిన స్లోబాల్‌ను ఆడిని మందీప్ లాంగ్ ఆఫ్‌లో ధావన్‌కు కాచ్‌ఔట్ అయాడు. సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. 19.2 ఓవర్లో ఎస్ కౌల్ వేసి బంతిని హిట్ చేసిన గ్రాండ్హోమ్(40) రషీద్ ఖాన్ చేతిలో క్యాచ్‌ఔట్ అయ్యాడు. చివరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ధారిత 20 ఓవర్లో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
స్కోరు బోర్డు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: 218/6(20 ఓవర్లు)
పార్థీవ్ పటేల్(సి)కౌల్(బి)సందీప్ శర్మ 1, విరాట్ కోహ్లి(బి)రషీద్ ఖాన్ 12, ఎబి డి విలియర్స్(సి)ధావన్(బి)రషీద్ ఖాన్ 69, మోయిన్ అలీ (సి)గోస్వామి(బి)రషీద్ ఖాన్ 65, కోలిన్ డి గ్రాండ్హోమ్ (సి)రషీద్ ఖాన్(బి)ఎస్ కౌల్ 40, మందీప్ సింగ్(సి)ధావన్(బి)ఎస్ కౌల్ 4, సరరాజ్ ఖాన్(నాటౌట్)22, టిమ్ సౌథీ(నాటౌట్) 1.ఎక్స్‌ట్రాలు: 4. మొత్తం: 218. వికెట్లపతనం: 1/6, 2/38, 3/145, 4/149, 5/176, 6/210. బౌలింగ్: సందీప్ శర్మ 40401, షకీబ్ అల్ హసన్ 40350, రషీద్ ఖాన్ 40273, సిద్ధార్థ్ కౌల్ 40442, బాసిల్ థంపి 40700.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 204/3(20 ఓవర్లు)
శిఖర్ ధావన్ (సి అండ్ బి) చాహల్ 18, అలెక్స్ హేల్స్ (సి) ఎబి డి విలియర్స్(బి)మోయిన్ 37, కేన్ విలియమ్సన్ (సి)గ్రాండ్హోమ్(బి)సిరాజ్ 81, మనీశ్ పాండే(నాటౌట్)62, దీపక్ హుడా(నాటౌట్)1
ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 204, వికెట్ల పతనం: 1/47, 2/64, 3/199.
బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 40310, టిమ్ సౌథీ 40450, యుజ్వేందర్ చాహల్ 40281, మహ్మద్ సిరాజ్ 40431, మోయిన్ అలీ 20211, కోలిన్ డి గ్రాండ్హోమ్ 20340.

Comments

comments