Search
Friday 25 May 2018
  • :
  • :

మంచినీటిని కనిపెట్టేస్తాయట!

Bird

మంచినీరు ఎక్కడుందో చెప్పడంలో మనుషులకు సాయం చేస్తాయట గబ్బిలాలు.  ముఖ్యంగా ఎడారి ప్రాంతంలో నివసించే వారికి నీటి కష్టాలు ఇన్నీఅన్నీకావు. నమీబియాలోని నబీబ్ ఎడారిలో పరిశోధకులు 18 నెలలుండి ఓ పరిశోధన చేశారు.  ఎడారి జంతువులు, పక్షులు నీళ్లు లేకుండానే బతగ్గలవు. ఆఫ్రికన్ ఎడారిలోనూ గబ్బిలాలు స్వచ్ఛమైన నీటినే తాగుతాయట. అందుకని అవి ఉన్న ప్రదేశాలవైపు వెళ్తుంటాయట. వీటిని అనుసరిస్తూ మానవులు కూడా అక్కడి నీటి ప్రదేశాల్ని కనుగొంటున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.  నమీబ్ ఎడారిలో స్వచ్ఛమైన నీరు దొరకడం చాలా అరుదు.  ప్రతి ఏడాదీ ఇదే పరిస్థితి ఉంటుందక్కడ. అక్కడుండే జీవజాలం చాలా ఇబ్బందులు పడుతోంది. ఎగరగలిగే గబ్బిలాలు, శుభ్రమైన నీటిని కనిబెడతాయి.  ఒకరాత్రిలోనే అనేకమైన చిన్నచిన్న  నీటి కుంతలను ఇవి కనుగొన్నాయట.   ప్రపంచం మొత్తంమీద 1300 రకాలున్నాయి. అంటార్కిటికాలో తప్ప అన్నిచోట్లా ఇవి వుంటాయి.   దోమలు క్రిమికీటకాలను తింటూ పర్యావరణాన్ని కాపాడుతుంటాయి.  పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగడం వీటి ప్రత్యేకత.

Comments

comments