Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

పక్షులను మింగుతున్న ప్లాస్టిక్‌

Bird-Eat-to-Plastic

ప్లాస్టిక్‌తో ప్రాణాలకే ముప్పు అనే విషయం అందరికి తెల్సిందే. ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ అవసరం మరీ ఎక్కువైపోయింది. దీనికి ముఖ్యకారణం మనం వాడే ప్రతి వస్తువులో ప్లాస్టిక్ ఉండటమే.  అలా కాకుండా మనం షాపింగ్‌కి వెళ్లినప్పుడు బట్టతో కుట్టిన బ్యాగులను తీసుకెళ్లడం ద్వారా కనీసం కొద్దిగనైనా ప్లాస్టిక్ వాడకం తగ్గుతుంది. మనకు ఎందుకులే అనుకుంటే వాతవరణంతో పాటు మనకు కూడా ప్రాణహాని ఉంటుంది. కాని మనిషి సృష్టిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల కాలుష్యం  వాతవరణాన్నే కాకుండా.. ఇప్పటికే నీళ్ళు, ఆహారం దొరక్క మనిషికి దూరంగా బతుకుతున్న మూగ జీవాల ప్రాణాలను తీస్తుంది. ఇందుకు ముఖ్య కారణం గత కొద్ది నెలలుగా పసిఫిక్ సముద్ర తీరంలోని మిడ్‌వే ఐలాండ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా అక్కడి పక్షుల సంఖ్య చాలా వరకు తగ్గింది. అవి వేల సంఖ్యలో ప్రాణాలను విడుస్తున్నాయి. ఈ ఐలాండ్‌లో ఎక్కువ శాతం ఆల్బట్రాస్ జాతి అనే పక్షులు జీవిస్తుంటాయి. ఇవి సముద్రతీరం వెంట  చేపలను వేటాడి తింటూ బతుకుతుంటాయి.

  కాని వాటి ఆకలి తీరుస్తున్న అక్కడ ఉన్న సముద్రమే వాటి ప్రాణాలను తీస్తుంది. ఎలా అంటే సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన ప్లాస్లిక్ వ్యర్థాలను చూసి వాటిని చేపలుగా భావించి అవి తినటమే కాకుండా వాటి పిల్లలకు కూడా తినిపిస్తున్నాయి. పాపం దీంతో తిన్న వ్యర్థాలను జీర్ణంచుకోలేక ఎక్కువ సంఖ్యలో పక్షులు మరణిస్తున్నాయి. ఒక రోజు అమెరికాలో ఉండే ఒక ఫోటోగ్రాఫర్ వాటిని చూసి వెంటనే తన కెమేరాలో అక్కడి పరిస్థితిని చూసి కొన్ని  ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేసాడు. అతనే  అమెరికా ఫొటోగ్రాఫర్ క్రిస్ జార్డన్ హోప్స్.  చనిపోయిన పక్షి కడుపులో ప్లాస్టిక్ వ్యర్థాలు జీర్ణంకాక  ఉన్న ఆ చిత్రంతో అక్కడి పరిస్థితి కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఈ సంఘటనపై  ఫొటో గ్రాఫర్ జార్డన్ మాట్లాడుతూ..

‘ప్లాస్టిక్ వస్తువులను మనం ఒకసారి వాడేసిన తర్వాత పడేస్తున్నాం. అవి భూమిలో కలిసిపోవడం చాలా కష్టం. ప్లాస్టిక్‌ను నివారించడం ఒక్కరితో అయ్యే పని కాదు. మార్పు తీసుకురావాలంటే అందరిలోనూ చైతన్యం రావాలి’ అని అన్నారు. మన దేశంలో స్వచ్ఛ భారత్ లాంటి ఎన్నో ప్రోగ్రాంలను చేస్తున్నా అవి కేవలం రాజకీయ లబ్ధికోసం అని మనం భావిస్తుంటాం. కాని ప్లాస్టిక్, చెత్త రోడ్డుపై వేయడం, ధూమపానం చేయడం వంటివి ఎవరో చెప్తే చేయడం కాదు అది మన మనసులో నుంచి రావాలి. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్‌కు దూరంగా ఉండి వాతరవణంతో పాటు జీవరాసులని కూడా రక్షించుకోవడం మన బాధ్యత.

Comments

comments