Search
Monday 21 May 2018
  • :
  • :

నటుడు శివాజీపై దాడి

BJP Activists attack on Actor Shivaji at Gannavaram Airport

విజయవాడ : గన్నవరం ఎయిర్‌పోర్టులో నటుడు శివాజీపై బిజెపి కార్యకర్తలు దాడి చేశారు. ఎపి బిజెపి అధ్యక్షుడిగా నియామకమైన కన్నా లక్ష్మీనారాయణకు స్వాగతం పలికేందుకు బిజెపి కార్యకర్తలు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఇదే సమయంలో గన్నవరం ఎయిర్‌పోర్టులో వారికి శివాజీ కనిపించారు. దీంతో శివాజీపై బిజెపి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదంటూ శివాజీ ఇటీవలికాలంలో ప్రధాని మోడీ, బిజెపిపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతోనే బిజెపి కార్యకర్తలు శివాజీపై దాడి చేశారు.

BJP Activists attack on Actor Shivaji at Gannavaram Airport

Comments

comments