Search
Monday 21 May 2018
  • :
  • :

కర్నాటక కలిస్తే బిజెపి జేబులో 20!

రాష్ట్రాలకే పరిమితమైన కాంగ్రెస్ రాష్ట్రాల్లోనే బిజెపి, కాంగ్రెసేతర పార్టీలు
శాతం జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి మించిన రికార్డు

BJP-Ruling-in-States

మిట్టపల్లి శ్రీనివాస్

దేశం క్రమంగా కాషాయంగా మారుతోంది. ఉత్తర, దక్షిణ, ఈశాన్యం అనే తేడా లేకుండా కశ్మీర్ నుంచి కర్నాటక వరకు బిజెపి హవా వీస్తోంది. తాజాగా జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయాణిస్తున్న బిజెపి దేశంలోని 29 రాష్ట్రాల్లో ఇప్పటికే 19 చోట్ల భాగస్వామ్య పార్టీలతో కలిసి పరిపాలన సాగిస్తోంది. వచ్చే వారం రోజుల్లో కర్నాటకలో కూడా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే దేశంలో మొత్తం ఇరవై రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లవుతుంది. దేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇన్ని ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉండడం అసాధారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 1993లో కాంగ్రెస్ హయాంలో 26 రాష్ట్రాల్లోని పదహారు రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో కలిసి పాలన సాగించడం కాంగ్రెస్ రికార్డు అయితే, ఇప్పుడు దాన్ని బిజెపి తిరగరాసింది. రాజకీయ చరిత్రలో సరికొత్త పుటలు లిఖించింది. 2014లో నరేంద్రమోడీ అధికారం చేపట్టినప్పుడు కేవలం 14 రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి పాలన ఉంటే, ఈ నాలుగేళ్ళ వ్యవధిలో అది 20 రాష్ట్రాలకు పెరిగింది. ఎన్నడూ ఈశాన్య రాష్ట్రాల్లో కనిపించని బిజెపి పాలన ఇప్పుడు మోడీ హయాంలో అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, అసోం లాంటి రాష్ట్రాలతో పాటు వామపక్ష పార్టీ కంచుకోటగా ఉన్న త్రిపురలో కూడా పాగావేసింది. బిజెపికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌కు 2014లో పద్నాలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా, ఇప్పు డు అది కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితమైంది.

ఇందులో పుదుచ్చేరి కేవలం 30 అసెంబ్లీ స్థానాలున్న చిన్న కేంద్రపాలిత ప్రాంతం. మిజోరం, పంజాబ్ రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పాలన సాగుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంతగా పతనం కావడం ఇదే తొలిసారి అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో దేశంలో డ్బ్బై శాతం (అంటే, 85 కోట్ల మంది ప్రజలకు) మందికి బిజెపి ప్రాతినిధ్యం వహిస్తుండగా, కాంగ్రెస్ కేవలం 2.5 మంది ప్రజానీకానికి మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశంలో బిజెపి, కాంగ్రెసేతర పార్టీలు ఆంధ్రప్రదేశ్ (తెలుగుదేశం), తెలంగాణ (తెలంగాణ రాష్ట్ర సమితి), కేరళ (సిపిఎం), ఒడిషా (బిజూ జనతాదళ్), పశ్చిమబెంగాల్ (తృణమూల్ కాంగ్రెస్), తమిళనాడు (అన్నాడిఎంకె) రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్నాయి. ఇక బిజెపి పాలన సాగిస్తున్న రాష్ట్రాలు వరుసగా అసోం, బిహార్, చత్తీస్‌ఘడ్, గోవా, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాల య, నాగాలాండ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లు గా ఉన్నాయి.

కర్నాటక ఎన్నికలకు ముందు బిజెపి త్రిపుర, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో విజయబావుటాను ఎగరేసింది. అంతకుముం దు జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో కూడా విజయాలను సాధించింది. దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు పది ఉం టే, అందులో ఏడు బిజెపి పాలనలోనే ఉండడం విశేషం. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌లలో బిజెపి పాలన ఉంది. కానీ ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్‌డిఏ కూటమి నుంచి తెలు గుదేశం వైదొలగడంతో ప్రాంతీయ పార్టీ పాలన కొనసాగుతోంది. దక్షిణాదిన అత్యంత కీలకమైన కర్నాటకలో కాంగ్రె స్ బిజెపిల మధ్య హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ పోరులో బిజెపి అత్యధిక సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఇక్కడ బిజెపి తన మెజారిటీని, అంటే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి,వారం రోజుల్లోగా నిరూపించుకుంటానని గవర్నర్ కు విన్నవించింది. ఈ రాష్ట్రం కూడా బిజెపి ఖాతాలోకి చేరితే దేశంలో ఇరవై రాష్ట్రా ల్లో పాలన సాగిస్తున్న అతి పెద్ద జాతీయ పార్టీగా చరిత్ర సృష్టించనుంది.

Comments

comments