Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

స్మార్ట్ ఫోన్లపై క్యాష్ బ్యాక్ ఆఫర్..

Cash back offer on smart phones

ముంబయి: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌, ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌ ఇండియాలు చేతులు కలిపాయి.  ఈ రెండు సంస్థలు కలిసి బడ్జెట్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన్లను తీసుకురానున్నట్లు శుక్రవారం వెల్లడించాయి. భారతీయులు లక్షల మంది ఇప్పటికీ స్మార్ట్‌ఫోన్‌ వినియోగించడం లేదని, వారినీ దృష్టిలో పెట్టుకునే అతి తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్ల‌ను అందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇరు సంస్థలు వెల్లడించాయి. ఈ ఫోన్ల ధర అతి తక్కువగా రూ.3,999 నుంచి ప్రారంభమవుతుందని తెలిపాయి. దీంతో పాటు ఇరు కంపెనీలు భాగస్వాములుగా మారిన నేపథ్యంలో 65 స్మార్ట్‌ఫోన్లపై రూ. రూ.2,600 వరకూ క్యాష్‌ బ్యాక్‌ను అందించనున్నట్లు బీఎస్‌ఈ ఫైలింగ్‌ సందర్భంగా వెల్లడించాయి. ఇందులో శాంసంగ్‌ సహా, వన్‌ ప్లస్‌, షామీ, హానర్‌, ఎల్‌జీ, లెనోవో, మోటో తదితర ఫోన్లు ఉన్నాయి.

Comments

comments