Search
Monday 21 May 2018
  • :
  • :

నీరవ్ మోడీపై రెండో చార్జ్‌షీట్…

neerav-modi

ఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్లు ఎగ్గొట్టిన నీరవ్ మోడీ కేసులో సిబిఐ పోలీసులు బుధవారం రెండో చార్జ్ షీట్ ను నమోదు చేశారు. మోహుల్ ఛోస్కీ సుమారు 7 వేల కోట్ల స్కామ్ చేసినట్టు సిబిఐ తన చార్జ్ష్ షీట్ లో పేర్కొంది. రూ,512 కోట్లకు సంబంధించిన 6 లేఖలను కూడా సిబిఐ తన చార్జీ షీట్ లో పొందుపరిచింది. ఐపిసిలోని సెక్షన్ 409, 420 కింద చార్జ్ షీట్ ను తయారు చేశారు. సిబిఐ తన చార్జ్ షీట్ లో ఛోస్కీని మోస్ట్ వాంటెడ్ గా వెల్లడించింది. 50 సాక్షాధారాలను పరిశీలించిన అనంతరం  ఈ నిర్ధారణకు వచ్చినట్టు సిబిఐ తెలిపింది. 12 లావాదేవీలు కూడా ఛోస్కీ చేసినట్టు నివేదికలో పేర్కొంది. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, గిల్లీ ఇండియా లిమిటెడ్, నక్షత్రా బ్రాండ్ లిమిటెడ్ సంస్థలపై కూడా ఛార్జ్ షీట్ ను నమోదు చేసింది.

Comments

comments