Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

నెం.07 మాకు బాగా కలిసొచ్చింది: ధోనీ

Chennai Super Kings beat Sunrisers Hyderabad to win IPL 2018 title

ముంబయి: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపిఎల్ పదకొండో సీజన్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో చెన్నై ఏకంగా ఎనిమిది వికెట్లతో తేడాతో భారీ విజయం సాధించి ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఇక ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల నిషేధం అనంతరం ఈ ఏడాది పున:ప్రవేశం చేసిన చెన్నై వస్తు వస్తూనే అద్భుత ప్రదర్శనతో టైటిల్ ఎగరేసుకోపోయింది. ఇది చెన్నైకు మూడో టైటిల్(2010, 2011, 2018). ఈ మూడు కూడా ధోనీ సారథ్యంలోనే రావడం విశేషం. జట్టు మొత్తం వయసు పైబడిన ఆటగాళ్లతో నిండిపోయిందంటూ తొలుత విమర్శలు ఎదుర్కొన్న విషయం విదితమే. అయితే వయసు కంటే అనుభవమే ముఖ్యమని చెన్నై జట్టు చాటి చెప్పింది.

ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా వెటరన్ ఆటగాడు షేన్ వాట్సన్ కేవలం 57 బంతుల్లోనే అజేయంగా 117 పరుగులు చేసి చెన్నైకి ట్రోఫీని అందించాడు. అలాగే కావేరి వివాదంతో హోం గ్రౌండ్‌లో కూడా మ్యాచ్‌లు ఆడే అవకాశం కోల్పోయిన చెన్నై అద్భుత ప్రదర్శనతో టైటిల్ విజేతగా అవతరించడం గమనార్హం. ఈ సందర్భంగా కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ… నెం.07 సెంటిమెంట్ మాకు బాగా కలిసొచ్చిందన్నాడు. ఫైనల్ జరిగిన తేదీ 27, చెన్నై ఫైనల్స్‌కు రావడం 7వ సారి, టార్గెట్ 179, వాట్సన్ సాధించిన స్కోర్ 117, నా జెర్సీ నంబర్ 07 ఇలా అన్ని చోట్లా మాకు నెం.07 కలిసొచ్చిందని ధోనీ చమత్కరించాడు. ఇక నంబర్ సెంటిమెంట్‌ను పక్కనపెడితే, జట్టు కలిసికట్టుగా ఆడటం వల్లే మాకు ఘనవిజయం దక్కిందని ధోనీ వ్యాఖ్యానించాడు.

Comments

comments