Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

క్వాలిఫయర్ మ్యాచ్‌: సన్‌రైజర్స్ బ్యాటింగ్..

chennai-vs-hyd

ముంబయి: ఐపిఎల్-11లో భాగంగా వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సామ్ బిల్లింగ్ స్థానంలో షేన్ వాట్సన్ ను తుది జట్టులోకి తీసుకున్నట్లు చెన్నై సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. మరోవైపు సన్‌రైజర్స్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఇక బుధవారం కోల్‌కతా, రాజస్థాన్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు తొలి క్వాలిఫయర్‌లో ఓడిన జట్టుతో తలపడనుంది.

Comments

comments