Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఫైనల్‌ లో ఫీల్డింగ్ ఎంచుకున్నచెన్నై

match

ముంబయి: వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్నఐపిఎల్ 2018 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇదివరకే చెన్నై చేతిలో 3సార్లు ఓడిన హైదరాబాద్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని రేడీగా ఉంది. ఫైనల్లోనూ అదే జోరుని కొనసాగించాలని ధోనీసేన ఉవ్విళ్లూరుతోంది. గత మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో దాదాపు ఓటమి దగ్గరకి వెళ్లిన చెన్నైఆఖర్లో హైదరాబాద్ బౌలర్లు పట్టు సడలించడంతో గెలిచింది. ముఖ్యంగా సన్‌రైజర్స్ సంచలన స్పిన్నర్ రషీద్ ఖాన్ తన గూగ్లీలతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. బంతుల వ్యవధిలో మ్యాచ్ గమనాన్ని మార్చాడు. దీంతో ఆదివారం ఫైట్ మొత్తం చెన్నై బ్యాట్స్‌మెన్ vs రషీద్ ఖాన్‌లా జరిగే అవకాశం ఉంది. చెన్నై ఇప్పటికే రెండు సార్లు ఐపిఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. హైదరాబాద్ జట్టు 2016లో టైటిల్ విజేతగా నిలిచింది.

Comments

comments