Search
Friday 25 May 2018
  • :
  • :

పల్లెల్లో చెక్కుల పండగ

raith-bandhi

కొత్త కళను సంతరించుకున్న పల్లెలు
పాసుపుస్తకాల కోసం పల్లెబాట పట్టిన జనం
దశాబ్దాల తర్వాత కొందరు గ్రామం వైపు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం పుణ్యమా అని పల్లెలు పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. పల్లెల్లో భూములు కలిగిన ఆడపడుచులు వ్యవసాయేతర వృత్తుల్లో స్థిరపడిన వారు జీవనోపాధి కోసం దూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా పాసుపుస్తకాలు, రైతుబంధు చెక్కుల కోసం గ్రామాలకు వస్తున్నారు. దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టలు, గ్రామోత్సవాలు జరిగిన సందర్భాల్లో ఉండే వాతావరణం ఇప్పుడు కన్పిస్తుంది.

మన తెలంగాణ/ఖమ్మం ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడినిచ్చి వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబంధు ఫథకంతో పల్లెలు కొత్త వాతావరణాన్ని సంతరించుకున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన చేసి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను అందించడంతో పాటు ఎకరాకు రూ.4వేలను తొలి దశలో అందించనుంది. రబీలో మరో రూ.4వేలు అందించనున్నారు. పాసుపుస్తకాలు, చెక్కులను స్వ యంగా భూ యాజమానులే తీసుకోవాలన్న నిబంధన విధించడంతో ఎక్కడెక్కడో నివసిస్తున్న వారు గ్రామాలకు చేరుకున్నారు. దశాబ్దాలుగా గ్రామం వైపు రాకుం డా సొంత గ్రామానికి దూరంగా జీవిస్తున్న వారంతా గ్రామాలకు చేరుకున్నారు. ఆడపడుచులు పుట్టింటిళ్లకు చేరడంతో కుటుంబాల్లో ఆనందం వెళ్లివిరిసింది. చెక్కు లు, పాసుపుస్తకాల పంపిణీ కేంద్రాల పలకరింపులు, కుసల ప్రశ్నలు, పిల్లల చదువుల సంగతులు నిజంగా పండుగ సరికొత్త వాతావరణం ఏర్పడింది. అచ్చు తప్పులు, భూ విస్తీర్ణంలో తేడాలు, అధికారులతో సంప్రదింపులు చెక్కుల పండుగ బిజిబిజిగా గడిచిపోయింది. చెక్కులను బ్యాంకులలో డ్రా చేసుకునేందుకు ప్రతి గ్రామానికి నిర్దిష్టమైన రోజును కేటాయించారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆరోజు బ్యాంకులో కలుద్దామంటూ వీడ్కో లు చెప్పుకోవడం కన్పించింది. మొత్తం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పల్లెకు కొత్త పండుగను తెచ్చిపెట్టింది.

Comments

comments