Search
Friday 25 May 2018
  • :
  • :

పంద్రాగస్టున పిఆర్‌సి

kcr

జులై ఆఖరులోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 

జూన్ 2న రాష్ట్ర సిబ్బందికి తాత్కాలిక భృతి ప్రకటన
సంఘాలతో చర్చల అనంతరం నిర్ణయాలు వెల్లడించిన సిఎం

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఉద్యోగులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఇప్పటివరకు ఉన్న ఏకసభ్య కమిషన్ స్థానం లో త్రిసభ్య కమిషన్‌ను నియమిస్తున్నామని, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ప్రకటిస్తామని, అదే రోజున ఉద్యోగులకు తాత్కాలిక భృతి (ఇంటెరిమ్ రిలీఫ్)ను కూడా ప్రకటించనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15వ తేదీన పిఆర్‌సిని ప్రభుత్వం ప్రకటిస్తుందని, అప్పటికల్లా కమిషన్ తన నివేదికను సమర్పిస్తుందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తిన అన్ని అంశాలపై ప్రభుత్వం సానుకూలం గా ఉందని ప్రకటించిన ముఖ్యమంత్రి సాధారణ బదిలీలకు అంగీకారం తెలపడంతో పాటు పటిష్టమై న పాలసీని రూపొందించనున్నట్లు తెలిపారు. ఉద్యో గ, ఉపాధ్యాయ సంఘాలు, మంత్రుల కమిటీతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇంతకాలం ఉద్యోగుల పదోన్నతులకు మూడేళ్ళ సర్వీసు నిబంధన ఉండేదని, దాన్ని రెండేళ్ళకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. మహిళా ఉద్యోగుల కోరిక మేరకు ప్రతీ ఏటా ఐదు ప్రత్యేక క్యాజువల్ లీవ్‌లను మం జూరు చేయాలని ప్రభు త్వం నిర్ణయించినట్లు తెలిపారు. సాధారణ బదిలీ ప్రక్రియను వచ్చే నెల 15వ తేదీకల్లా పూర్తి చేయాలని, ఆ తర్వాత పం చాయతీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సాధారణ బది లీ ప్రక్రియలో అవినీతికి, పైరవీలకు, అక్రమాలకు తావులేకుండా పటిష్ఠ మార్గదర్శకాలను రూపొందించడానికి సీనియర్ ఐఎఎస్ అధికారులు ఆజయ్ మిశ్రా, అదర్‌సిన్హా, శివశంకర్‌లతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవినీతికి తావులేని విధంగా మార్గదర్శకాలను రూపొందించి ప్రధాన కార్యదర్శికి సమర్పిస్తుందని, ఆ తర్వాత ఉత్తర్వులు వెలువడతాయన్నా రు. తెలంగాణ ట్రాన్స్‌ఫర్ పాలసీ పేరుతో శాశ్వత విధానం రూపొందుతుందని తెలిపారు. ఉద్యోగులకు ఇప్పటివరకు రెండు డి.ఎ. (కరువుభత్యం) పెండింగ్‌లో ఉందని, ఒక డి.ఎను తక్షణం చెల్లిస్తామని, మరో డి.ఎను రెండు నెలల తర్వాత ఇస్తామని, కొత్త డి. ఎను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బదిలీ విధానంపై ఉద్యోగ సంఘాలతో చర్చించి పరిశీలించి నివేదిక తయారుచేసి కేబినెట్ సబ్‌కమిటీకి అందిస్తారన్నారు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు 15 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టదన్నారు. భార్యాభర్తలను ఒకే చోట ఉండేలా బదిలీలు చేయాలని గతంలోనే ఆదేశించానని, అయితే పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని, త్వరలో ఈ ప్రక్రియను వంద శాతం పూర్తి చేస్తామన్నారు. ఎక్కడైనా ఒకే చోట పోస్టింగ్ ఇచ్చే అవకాశం లేకపోతే ఎక్కువ దూరం లేకుండా పక్కపక్క ఊర్లలో ఉండే విధంగా బదిలీలు చేస్తామని స్పష్టంచేశారు. జోనల్ విధానం కూడా ఏర్పాటుచేయాల్సి ఉందని, త్వరలోనే జోనల్ క్యాడర్, స్టేట్ క్యాడర్, డిస్ట్రిక్ట్ క్యాడర్ ఇలా అన్నింటిని నిర్ణయిస్తామన్నారు. జోనల్ విధానానికి కమిటీ వేశామని, ఈ కమిటీ ఉన్నతాధికారులతో చర్చించి విధానం రూపొందించి క్యాబినెట్ ఉపసంఘానికి నివేదిక ఇస్తుందన్నారు. దీనిని క్యాబినెట్‌లో ప్రవేశపెట్టి అమలులోకి తెస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన జరగడంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీ, కేటాయింపులు వంటి ఎన్నో గొడవలు ఉండేవని, దాదాపు చాలావరకు పరిష్కారమయ్యాయని, డిఎస్‌పిల వ్యవహారమే పెండింగ్‌లో ఉందని సిఎం పేర్కొన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి త్వరలోనే ప్రత్యేక పాలసీని తయారుచేయాలని నిర్ణయించామని సిఎం తెలిపారు. ఉపాధాయ్యుల ఏకీకృత సర్వీసుకు సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసు సత్వర విచారణకు సీనియర్ న్యాయవాదిని నియమించి కొలిక్కి తెస్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల ఎల్‌టిసి (లీవ్ ట్రావెల్ కన్సెషన్) విధానంలో గతంలో లోపభూయిష్టత ఉండేదని, ఇప్పుడు దాన్ని సవరించి పారదర్శక పాలసీని తెస్తామని, ప్రతీ ఉద్యోగికీ వర్తించేలా రూపొందిస్తామని, రాష్ట్రం లోపలే కాకుండా దేశమంతా తిరిగే అవకాశం ఉంటుందని, అవసరమైతే మూడు సంవత్సరాలు వాడుకోకుండా విదేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ విధానాన్ని సరళతరం చేసి ఉద్యోగులు టిక్కెట్లు, బిల్లులు సమర్పించాల్సిన అవసరం లేకుండా పాలసీని రూపొందిస్తామని తెలిపారు. ఇందుకోసం నిర్దిష్ట అలవెన్సు ఇస్తామని, ఉద్యోగుల ఇష్టాయిష్టాల మేరకు ఎక్కడకు వెళ్తారో, దానికి అయ్యే ఖర్చుకు ఉద్యోగ సంఘాలే స్పష్టమైన మార్గదర్శకాలను సూచిస్తాయని తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లాంటి మారుమూల జిల్లాలు, ప్రాంతాల్లో పనిచేయడానికి ఉద్యోగులు ఆసక్తి చూపడంలేదని, అందువల్ల ప్రత్యేక అలవెన్సును ఇస్తామని, సంతోషంగా పనిచేసుకునే వీలు కల్పిస్తామన్నారు. ఆయా ప్రాంతాలు, ఇవ్వాల్సిన అలవెన్సును పిఆర్‌సిలో నిర్ణయిస్తామన్నారు. ఉద్యోగంలో ఉంటూ మరణించినవారికి ఇచ్చే కారుణ్య నియామకాల విధానం సరిగ్గా లేదని, కుటుంబాలు బాధలో ఉండే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని పది రోజుల్లోనే ఈ నియామకం జరిగేలా ఆదేశాలిచ్చామని, త్వరలోనే సిఎస్ సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు. భాషా పండితులు, పిఇటిల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌ను పకడ్బందీగా అమలుచేయడానికి ఒక పాలసీని రూపొందించాలని, ఆ బాధ్యతను ఉద్యోగ సంఘాలకే అప్పగించినట్లు తెలిపారు. పదోన్నతుల్లో పైరవీలు జరగకుండా నిర్దిష్టమైన ప్రమోషన్ పాలసీని తయారుచేస్తున్నామన్నారు. రిటైర్ అయినవారికి అదే రోజునే అన్ని రకాల బెనిఫిట్స్‌ను అందించి, సన్మానించి ప్రభుత్వ ఖర్చుతోనే స్వంత ఊరిలో దించుతామని తెలిపారు. రైతుబంధు పథకంలో వచ్చిన డబ్బును ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడానికి ముదుకొచ్చిన గెజిటెడ్ ఉద్యోగుల సఘానికి సిఎం కృతజ్తతలు తెలిపారు. రాష్ట్రం పురోగమించే క్రమంలో పునర్ నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర ఉజ్జ్వలంగా ఉందని, ఆర్థిక ప్రగతిలోనే కాకుండా విద్య, వైద్యం, ఇతర రం గాల్లో కూడా వారి సేవలు మరువలేనివని అన్నారు. కెసిఆర్ కిట్ పథకం అమలుకు ఇప్పుడున్న డాక్టర్ల సంఖ్య కంటే మూడు రెట్ల అవసరం ఏర్పడిందని, అయినా కొత్త డాక్టర్‌ను నియమించుకోకుండానే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు మూడు రెట్ల పనులు చేస్తున్నారని, ఈ పథకం విజయవంతంగా అమలవుతోందని అన్నారు. దీనివల్ల అనవసర ఆపరేషన్ల బారి నుంచి బైపటడడం కాకుండా ఖర్చు తగ్గి ఆర్థికంగా ప్రజలకు మేలు జరిగిందన్నారు.

ఫెడరల్ ఫ్రంట్ గొప్ప శక్తిగా ఆవిర్భవిస్తుంది

మన తెలంగాణ / హైదరాబాద్ : “నేను ప్రతిపాదించేది మామూలు మార్పు కాదు. అది ప్రబలమైన గుణాత్మకమైన మార్పు. ఒకటి, రెండున్నర నెలల్లో దీనికి సంబంధించిన ఎజెండాను తయారు చేస్తాం. ఈ ప్రతిపాదన 2019 ఎన్నికల నాటికి పూర్తిస్థాయి రూపం సంతరించుకుంటుంది. ఇది బయటకు వచ్చాక అద్భుతాలు జరుగుతాయి. ఇందులో కెసిఆర్ ఒక్కడే ఉండడు. ఈ ఎజెండాతో కలిసే భావాలున్న పార్టీలతో పాటు ఒక బలమైన రాజకీయ శక్తిగా (ఫోర్స్)” ఉండబోతుంది అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ప్రగతిభవన్‌లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము దేశం ముందు ఉంచబోయే ఎజెండా ఆషామాషీగా ఉండబోదని, ఇప్పటికే దీనికి మద్ధతునిస్తున్న అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ తమ వెంట ఉన్నారంటే, ఆ రాష్ట్రాల ప్రజలు కూడా తమ వెంట ఉన్నారన్నారు. ఇంకా ఇతరులు కూడా తమ లైన్‌లో ఉన్నారని చెప్పారు. జనతాపార్టీ జైల్లో పుట్టి 60,70 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. దేశంలో వ్యవస్థాగతమైన, విప్లవత్మకమైన మార్పు రావాల్సి ఉందన్నారు. మొదటిసారిగా సొంత మెజార్టీతో కాంగ్రెసేతర ప్రధానిగా ఎన్నికైన నరేంద్రమోడి, లోక్‌సభలో సంపూర్ణ మద్ధతు ఉన్నప్పటికీ ఆయన ప్రతిపాదించిన బిల్లులను ఆమోదించుకోలేకపోతున్నారని, రాజ్యసభలో పెండింగ్‌లో ఉంటున్నాయని, ప్రజలు ప్రత్యక్షంగా ఓటేసి గెలిపించి పార్లమెంట్ సభ్యులను గౌరవిద్దామా లేక రాజ్యసభ సభ్యులను గౌరవిద్దామా అని ప్రశ్నించారు. ఇలాంటివి అనేక అంశాలు ఉన్నాయని, ఇందుకు రాజకీయ, ఆర్థిక సంఘాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఈ మార్పుకు హైదరాబాద్ కేంద్రంగా అవుతున్నందుకు గర్వపడాలన్నారు. త్వరలోనే ఒడిస్సా సిఎంను కలుస్తానని, తప్పకుండా ఎపి సిఎం చంద్రబాబును కూడా కలుస్తానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కర్నాటకలో తాను గతంలో చెప్పిన విధంగానే ప్రాంతీయ పార్టీ అయిన జెడిఎస్‌ను దగ్గర చేసుకునేందుకు కాంగ్రెస్, బిజెపిలు వివిధ రూపాల్లో అర్రులు చాస్తున్నాయన్నారు. ఇప్పుడు కర్నాటకలో జరిగిందే భవిష్యత్తులో దేశంలో జరగబోతుందని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

వరాల మాల

ప్రతీ ఉద్యోగికి ఎల్‌టిసి
దేశమంతటికీ వినియోగించుకునే అవకాశం
రెండేళ్లకే పదోన్నతి

రెండు డిఎలు తక్షణమే
రెండు మాసాల తరువాత మరో డిఎ
వచ్చేనెల 15 కల్లా సాధారణ బదిలీలు పూర్తి
ఆ తరువాత పంచాయతీ ఎన్నికలు
అవినీతిని క్షమించే ప్రసక్తి లేదు
కడుపునిండా పిఆర్‌సి ఇస్తాం, చేతినిండా పనిచేయాలి
జోనల్ విధానంపై కేబినెట్‌కి బాధ్యత
నెల రోజుల్లో రాష్ట్రపతికి సిఫార్సు
సాధారణ బదిలీలకు శాశ్వత విధానం
మార్గదర్శకాలపై కమిటీ
గివ్ ఇట్ అప్ ప్రకటించిన గెజిటెడ్ ఆఫీసర్ల సంఘానికి సిఎం కృతజ్ఞతలు
భార్యాభర్తలైన ఉద్యోగులు ఒకే చోట పనిచేసే అవకాశం

Comments

comments