Search
Monday 21 May 2018
  • :
  • :

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులకు కౌన్సిలింగ్

Counseling for Alcohol peoples caught in drunk and drive

కరీంనగర్ క్రైం: కరీంనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులకు బుధవారం నాడు నగర శివార్లలో ఉన్న సిటీ పోలీస్ ల శిక్షణ కేంద్రం (సిపిటిసి)లో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో కరీంనగర్ ట్రాఫిక్ సిఐ సౌఢారపు సదానందం కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే దుష్ప్రరిణామాలు, ట్రాఫిక్ నియమ నిబంధనలపై పోలీస్‌శాఖ ప్రత్యేకంగా రూపొందించిన లఘు చిత్రాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. మద్యం సేవించి వాహనాలు నడిపి మొదటిసారి పట్టుబడినా శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు. మధ్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్‌ల నిర్వహణతో ప్రమాదాలు నియంత్రణలోనికి వస్తున్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లకు సహకరిస్తున్న అన్ని వర్గాల ప్రజలకు ఈ సందర్భంగా సిఐ సదానందం కృతజ్ఞతలు తెలిపారు.

Comments

comments