Search
Monday 21 May 2018
  • :
  • :

అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించండి

sri-devasena-image

మనతెలంగాణ/పెద్దపల్లి: మత విద్వేషాలకు పాల్ప డే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్  శ్రీదేవసేన పోలీసులను ఆదేశించారు. గురువారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో  రంజాన్ పండుగ ఏర్పాట్లు, శాంతి భద్రతలపై పోలీసులు,సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో సంఘ విద్రోహులు మ త విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉన్నందున జి ల్లా పోలీస్ యంత్రాంగం అన్ని ప్రాంతాల్లో భద్రత ను కల్పించాలని సూచించారు.ముస్లింలు,హిందువులఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని,ఎలాంటి పరిస్థితుల్లోలైనా సంయవన పాటించాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిలకు ఎలాంటి ఇ బ్బంది లేకుండ అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అదికారులకు  సూచించారు.జిల్లా కేంద్రంతో పాటు అన్ని ప్రాంతాల్లోని ముస్లిం ప్రార్థనాలయా ల వద్ద కనీస సౌకర్యాలైన  తాగునీరు,నిరంతరా య విద్యుత్,స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలను కలెక్టర్ అదేశించారు.ప్రార్థనా స్థలాలయిన ఈ ద్గా,మజీద్‌ల వద్ద పారిశుద్ధ్యం పాటించాలని, ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేసేలా శానిటేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ముస్లిం ప్రార్థనా స్థలాలను విద్యు త్ లైట్లతో అలంకరించాలని, అన్ని ప్రాంతాల్లో ఇఫ్తార్ విందులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నా రు. పండుగలు ప్రజల ఐక్యతకు సూచికలని, వాటిని శాంతియుత వాతావరణంలో మత సామరస్యం వెల్లివిరిసేలా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిఆర్‌ఒ భైరం పద్మయ్య,డిసిపి సుదర్శన్‌గౌడ్, పెద్దపల్లి ఎసిపి హబీబ్ ఖాన్, జిల్లా మైనార్టి వెల్ఫేర్ ఆఫిసర్ సుధాకర్ సం బంధిత అధికారులు పాల్గొన్నారు.

Comments

comments