Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఇష్టారాజ్యంగా నాసిరకం రోడ్డు నిర్మాణ పనులు

 Desirable road construction works

కురవి: కురవి గ్రామ పంచాయతీ పరిధిలోని రేకులతండాలో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా నాసిరకం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టి నెల రోజులు గడువక ముందే బిటి రోడ్డు రూపం మారింది అనే వార్త మన తెలంగాణలో ఆదివారం ప్రచూరించడం జరిగింది. దీంతో రేకులతండా గిరిజనులు, మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల నాయకులు స్పందించి నిజాలు నిర్భయంగా ప్రచూరించి ప్రజలను మేలుకొలిపే మన తెలంగాణ పత్రికకు కృతజ్ఞతలు తెలుపుతూ రేకులతండా నాసిరకం రోడ్డు పనులపై అధికారులు విచారణ జరుపాలని కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు మేక వెంకట్‌రెడ్డి, ఎస్‌టి సెల్ మండల కన్వీనర్ బానోతు లాలనాయక్, డిమాండ్ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రేకుల తండాకు వేసిన నాసిరకం రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అధికారుల పర్యావేక్షణలో వేయాల్సిన రోడ్డును గుత్తేదారులు ఇష్టారాజ్యంగా రోడ్డు వేశారని , తక్షణమే అట్టి బిల్లును నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నినాధాలు చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఐటిడిఎ మంజూరి చేసిన రూ.1.94 కోట్ల నిధులతో కురవి నుంచి వయా రాంచంద్రపురం, రేకులతండా శివారు డోర్నకల్ వేళ్లే ప్రధాన రోడ్డు వరకు చేపట్టిన బిటి రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిందని ఆరోపించారు. కనీసం అరించు మందం కూడా రోడ్డు వేయకపోవడంతో నెల రోజులకే రోడ్డుపై గుంతలు ఏర్పడి కంకరలేస్తుందన్నారు. కనీసం రోడ్డు అంచులకు ఉన్న పిచ్చి మొక్కలను కూడా తొలగించలేదని ఆరోపించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రజల సమక్షంలో రోడ్డు నిబంధనల ప్రకారంగా విచారణ జరిపి సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని యడల ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేకులతండా గ్రామ పార్టీ అధ్యక్షులు గుగులోతు నరేష్, నాయకులు బానోతు బాబురావు, చిన్నం శ్రీను గిరిజన వాసులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments