Search
Monday 21 May 2018
  • :
  • :

రాజ్‌భవన్ ముందు రేపట్నుంచి ధర్నా…

JDS

బెంగళూరు: కర్నాటక రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు తగిన బలంతో ఉన్న కాంగ్రెస్- జెడిఎస్ కూటమికి గవర్నర్ వాజుభాయ్ అనుమతించకపోవడం ఆ రెండు పార్టీలు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సాయత్రం 5 గంటలకు ఈ రెండు పార్టీల నేతలు గవర్నర్ కలవడానికి వెళ్లారు. కానీ గవర్నర్ అనుమతించకపోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలందరు కలిసి  రాజ్ భవన్ ఎదుట ధర్నా చేయాడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎంపిలు సైతం పాల్గొనే అవకాశం కనిపిస్తుంది.  ఒకవేళ జిజెపికి  ప్రభుత్వం ఏర్పాటు చేయాడానికి అనుమతిస్తే తాము సుప్రీం కోర్టుకు వెళ్లాడానికి కాంగ్రెస్, జెడిఎస్ నేతలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Comments

comments