Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

పెట్రోధరలు తగ్గించాలని ధర్నా

Dharna on mulugu national highway

 మన తెలంగాణ/ములుగుః పెంచిన డిజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ములుగు జాతీయ రహాదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ ములుగు మండల అధ్యక్షులు బానోతు రవిచందర్, మహబూబాబాద్ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ కోగిల మహేష్  వారు మాట్లాడుతూ పెంచిన  డిజిల్, పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని బిజెపి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నదని లీటర్ కు రూ. 81కి పెంచి సామాన్యులపై భారం మోపిందని ప్రభుత్వం చెప్పేదే ఒక్కటి చేసేది ఒక్కటని , పెట్రోల్ ధరలు రూ. 65 కు తగ్గిస్తే మోదీ ప్రభుత్వం బాగుటుందని లేని పక్షంలో ధర్నాలు రాస్తారోకోలు పెద్ద ఎత్తున చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి నల్లెల్ల కుమారస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్సి మసర గాని వినయ్ కుమార్, మండల కార్యదర్శి హరినాథ్ గౌడ్, మునిగాల కుమార్ గౌడ్, అశోక్ గౌడ్ , రాములు, చాంద్ పాషా, బొల్లం రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments