Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

వెక్కిరిస్తున్న సమస్యలు

 Difficulties for the people have increased

మన తెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ నెలసరి నమావేశాలు మొక్కుబడిగా సాగుతున్నాయి. సమస్యలు ప్రజలను వెక్కిరిస్తున్నాయి. మున్సిపల్  సమావేశాలు ఉత్తుత్తి సమావేశాలుగా నడుస్తున్నాయి. జిల్లా కేంద్రంగా మారాక ప్రజలకు కష్టాలు మరిన్ని పెరిగాయి. 15,30 రోజులకు ఒకసారి గోదావరి జలాలు సరఫరా అవుతున్నాయి. కామారెడ్డిలో నీటికి కటకట ఏర్పడింది. కాలనీ వాసులు నెలకు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుక్కుంటున్నారు. కాలనీల్లో నీటీ సరఫరాను మున్సిపల్ అధికారులు మర్చిపోయారు. నీటి సరఫరా, చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రతను కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదు. రూ.360 కోట్ల గోదావరి జ లాల పథకం కామారెడ్డి వాసులకు ఉపయోగపడడం లేదని, దాహం తీర్చడంలేదని జిల్లా కేంద్రం వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్ అధికారులు, సిబ్బందిలో నిర్లక్షం పెరిగిందని ప్రజలు విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్యం విభాగంలో కాంట్రాక్టు కార్మికుల పే రిట లక్షల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. బినామి కాంట్రాక్టు కార్మికుల పేరిట దళారు లు, కొందరు నేతలు జేబులు నింపుకుంటున్నారని ఫిర్యాదులు వ చ్చాయి. రూ.9 కోట్ల మున్సిపల్ నిధులు గోల్ మాల్ అయ్యాయని ఆ డిట్  రిపోర్టులో ఆడిట్ అధికారులు వెల్లడించారు. ఆడిట్ రిపోర్టును తారుమారు చేయడానికి కొందరు నేతలు, కాంట్రాక్టర్లు పైరవీలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి. రూ.4.50 కోట్ల         నీటి పథకం పట్టణ వాసుల దాహం తీర్చలేకపోయిందని, నేతల కాంట్రాక్టర్ల జేబులు నింపిందని పట్టణ వాసులు ఆగ్రహిస్తున్నారు. కోట్ల రూపాయలతో చేపట్టిన సిసి రోడ్లు, మురికి కాలువలు, బి.టి రోడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించిందని ప్రజలు విమర్శిస్తున్నారు.

నెలసరి మున్సిపల్  సమావేశాలు పాలక వర్గ ప్రయోజనాలకోసమే జరుపుకుంటున్నారని, పట్టణ వాసుల బాగోగులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. నాలుగు సంవత్సరాల మున్సిపల్ పాలనలో రెగ్యులర్ అధికారులు లేక ఇన్‌చార్జ్ అధికారులతోనే నెట్టుకొస్తున్నారని జిల్లా కేంద్రవాసులు వాపోతున్నారు. 30 ఏళ్ల క్రితం నిర్మించిన సుభాష్ రోడ్లోని మటన్ మార్కెట్ దుకాణాల సముదాయం  ఎవ్వరికి  కేటాయించకపోవడంతో మున్పిపల్ ఆదాయానికి గండి పడుతుందని విమర్శలు వస్తున్నాయి. మున్సిపల్ స్థలాలు రక్షణ లేకుండా ఆక్రమణకు గురవుతున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, బిజేపి నుండి గెలిచిన మెజారిటి కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్‌లు గులాబి దళంలో చేరడంతో అధికార టిఆర్‌ఎస్ పట్టునిలుపుకుంది. ఎంఎల్‌ఎ, విప్‌గోవర్దన్ జిల్లా కేంద్రం లో తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. ఐదు జిల్లాలకు కూడలి కేంద్రం అయిన కామారెడ్డిలో పెద్ద ఎత్తున వ్యాపార, వా ణిజ్యం సాగుతుంది. దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలం అయ్యారని విమర్శలు వ స్తున్నాయి. పట్టణంలో మరో ప్రధాన సమస్యగా ట్రాఫిక్ సమస్య తలనొప్పిగా మారింది. జిల్లా కేంద్రం అయ్యాక కామారెడ్డిలో ట్రాఫిక్ రద్దీ పెరిగి ప్రతిరోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని పోలీస్ అధికారులను పట్టణ వాసులు కోరుతున్నారు.

Comments

comments