Search
Monday 21 May 2018
  • :
  • :

సుదీర్ఘ ప్రయాణమా…. వద్దు!

Long-Drive

కారులో లాంగ్‌డ్రైవ్ ప్రయాణిస్తే చిక్కులేనని తాజా పరిశోధనలో తేలింది. చాలా దూరం అలాగే కూర్చుని ప్రయాణించడం వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టొచ్చంటున్నారు పరిశోధకులు.  జపాన్ భూకంపం తర్వాత కార్లలో చిక్కుకుపోయినవారిపై తాజాగా రీసెర్చ్ చేశారు. ఎక్కవ సమయం కదలకుండా ప్రయాణిస్తే వచ్చే సమస్యలపై హెచ్చరించారు. కారు లేదా విమానాల్లో గానీ ఎక్కువ సమయం ప్రయాణించేవారు వీన్ త్రోంబో ఎంబాలిజమ్ (వీటీఈ) సమస్య బారిన పడే ప్రమాదం ఉంటుందని కనుగొన్నారు. కాళ్లూ చేతుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితి వస్తుందన్నారు. 2016 ఏప్రిల్‌లో జపాన్‌లోని కుమమోటో భూకంపం తర్వాత కార్లలో సుదీర్ఘ సమయం చిక్కుకు పోయిన వారిపై అధ్యయనం నిర్వహించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. నాటి భూకంపం తర్వాత ఎక్కువ సమయం పాటు వాహనాల్లో చిక్కుకుని ఆ తర్వాత ఆసుపత్రి పాలైన 51 మంది రోగులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఆ పరిశోధనా ఫలితాలు కెనడియన్ జర్నల్ ఆఫ్ ఆర్డియాలజీలో ప్రచురితమయ్యాయి. 51 మంది రోగుల్లో 42 మంది తమ వాహనాల్లో రాత్రంతా గడిపి, వీటీఈ సమస్యతో బాధపడినవారే. కదల్లేని స్థితిలో ఎక్కువ సమయం పాటు గడిపితే వచ్చే ముప్పుకి ఇదో ఉదాహరణగా చెబుతున్నారు.

Comments

comments