Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

డాక్టర్లు లేరు..గర్భిణిల అవస్థలు

Doctors Not Available in Vikarabad Area Hospital

మనతెలంగాణ/ వికారాబాద్ జిల్లా : వికారాబాద్ ఏరియా ఆసుపత్రి పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. డాక్టర్లు లేక పోవడం వలన ఆసుపత్రికి వచ్చిన రోగులు తిరిగి వెనుదిరుగుతున్నారు. ఉన్న సిబ్బంది నామమాత్రంగా చూసి హైదరాబాద్‌కు వెళ్లాల్సిందిగా ఉచిత సలహాలు ఇస్తున్నారు. డబ్బులు లేక పేదరికంలో ఉన్న నిరుపేద రోగులు ఆసుపత్రికి వస్తే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. తాజాగా నవాబుపేట మండలంలోని చిట్టిగిద్ద గ్రామానికి చెందిన గర్భిణీ రాజశ్రీ ఆదివారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి వచ్చింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డాక్టర్లు లేరు. హైదరాబాద్‌కు వెళ్లాల్సిందిగా ఉచిత సలహాలు ఇచ్చినట్లు బాధితురాలి బంధువులు వాపోతున్నారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మారుమూల మండలాలు, గ్రామాలలోని ఆసుపత్రుల పనితీరు ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లా కేంద్రంలో 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఆదివారం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీలకు చికిత్స అందించకుండా హైదరాబాద్‌కు తీసుకువెళ్లమని చెప్పిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా కోరారు.

Comments

comments