Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

సామాజిక సేవకు ప్రతి రూపం సతీష్

 Every form of social service is Satish

మన తెలంగాణ/సంస్థాన్ నారాయణపురం ః విద్యార్థి దశ నుండే సేవా గుణాన్ని అలవర్చుకొని తాను సమాజానికి సేవ చేయడమే కాక తనతో పాటు యువతను భాగ స్వాములను చేస్తూ ప్రజల మన్ననలు పొందు తూ, విద్యార్థి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నా డు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రానికి చెం దిన గుంగమల్ల సతీష్ కుమార్. నేటి యువత మద్యానికి బాని సలై, దురల వాట్లకు ఆకర్శితులై తన చదువులను, భవిష్యత్‌ను పాడు చేసుకొని తల్లిదండ్రుల ఆప్యాయాతాను రాగా లకు, ప్రజల మన్నన లకు దూరమవు తున్న తరుణంలో స్థానిక యువకుడు సతీష్ ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజా ఉపయోగ కార్యక్ర మాలు చేప డు తూ శభాష్ అనిపి ంచుకుంటు న్నా డు. తన చిన్న నాటి నుండే హుషారు గా ఉంటూ తన తల్లిదండ్రులకు, తన స్వగ్రా మానికి మంచి పేరు తీసుకురావాలనే తలంపుతో సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇందుకు స్పూర్తి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అంటున్నాడు సతీష్.
సతీష్ నిర్వహించిన కార్యక్రమాలు ః
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరిత హారం కార్యక్రమం ద్వారా మొక్క ను నాటి విద్యార్థులను, ప్రజలను అ కార్యక్రమంలో భాగస్వాములను చేశాడు. యువత మద్యానికి బానిసలై తన దైనంది న భవిష్యత్‌ను నాశనం చేసు కో కుండా దాని వలన కలిగే అనర్ధాలను అవ గాహన సదస్సులు ఏర్పాటు చేసి తనతో పాటు పోలీ సు అధికా రులనుగూడా భాగస్వా ములను చేసి యువతకు వివరించేలా కృషి చేశాడు. జాస్వామ్యంలో ఓటు విలువ ఎం తో ముఖ్యమైనదని, ప్రజాస్వామ్య పరిర క్షణ లో ఓటు హక్కు ప్రాముఖ్యత-యువత పాత్ర అనే అంశంపై కళాశాలల్లో విద్యా ర్ధులకు సదస్సులు ఏర్పా టు చేసి స్థానిక ఆర్డీఓను, ఎమ్మా ర్వోను సమా వేశంలో భాగస్వాము లను చేసి ఓటు విలువ గురిం చి తెలియజేశా డు. బాలలు పలక పట్టే చేతులతో పారలు పట్ట కుండా ఉండాలనే ఉద్ధేశం తో ప్రతి ఒక్క చిన్నారిని బడికి పంపాలనే ఆలో చనతో గిరిజన తండా లలో అనేక సదస్సులు నిర్వహించి స్థానిక ఎం ఈఓను భాగ స్వామిని చేసి బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తన వంతు కృషి చేస్తున్నాడు. రక్తం అందరికి ఎంతో ముఖ్య మని భావించి ప్రమాదాలు సంబవించిన పుడు రక్తం అవరమయ్యే వ్యక్తులకు తన రక్తాన్ని ఇవ్వడమే కా కుండా, ఎక్కడ రక్త దాన శిబిరాలు ఏర్పా టు చేస్తే అక్కడికెళ్ళి తన రక్తాన్ని దానం చేస్తూ అధికారుల నుండి ప్రశంసలం దుకుటున్నాడు సతీష్.

Comments

comments